బిజినెస్

పిఎంఎవై కింద సబ్సిడీ పథకాన్ని ప్రారంభించిన ఐసిఐసిఐ బ్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 10: ప్రైవేటు రంగంలో అతిపెద్దదైన ఐసిఐసిఐ బ్యాంకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పిఎంఎవై) కింద క్రెడిట్-లింక్డ్ సబ్సిడీ పథకాన్ని ప్రారంభించింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలు పక్కా ఇళ్లు కొనుగోలు చేసుకునేందుకు లేదా నిర్మించుకునేందుకు ఈ పథకం కింద రుణాన్ని పొంది అత్యంత సులభమైన నెలవారీ కిస్తీల (ఇఎంఐ) రూపంలో తిరిగి చెల్లించేందుకు వీలు కల్పిస్తున్నట్లు ఐసిఐసిఐ బ్యాంకు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ పథకం కింద అర్హులైన రుణ గ్రహీతలకు క్రెడిట్-లింక్డ్ సబ్సిడీని అందించేందుకు నేషనల్ హౌసింగ్ బ్యాంకు (ఎన్‌హెచ్‌బి)తో ఐసిఐసిఐ బ్యాంకు అవగాహనా ఒప్పందాన్ని (ఎంఓయును) కుదుర్చుకుంది. ఈ పథకం కింద అర్హులైన ఖాతాదారులకు వారు పొందిన రుణాలపైన లేదా గరిష్ఠంగా రూ.6 లక్షల మొత్తంపైన (ఈ రెండింటిలో ఏది తక్కువైతే దానిపై) సంవత్సరానికి 6.5 శాతం చొప్పున గరిష్ఠంగా 15 ఏళ్ల పాటు సబ్సిడీ లభిస్తుంది.