యువ

ఇక ఐసిఐసిఐ యాప్‌లో రైల్ టికెట్ల అమ్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైల్వే టికెట్ల అమ్మకం మరింత సులభతరం కాబోతోంది. ఇప్పటివరకూ ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్ముతున్న ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) ఈ బాధ్యతలను ఇకపై ఐసిఐసిఐ బ్యాంక్‌కు కూడా అప్పగించబోతోంది. ప్రైవేటురంగంలో అతి పెద్ద బ్యాంక్‌గా అవతరించిన ఐసిఐసిఐకి గల విస్తృతి దృష్ట్యా ఈ బాధ్యతలను ఆ బ్యాంక్‌కు అప్పగించినట్టు ఐఆర్‌సిటిసి పేర్కొంది. వినియోగదారులు ముం దుగా ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌లో రిజిష్టర్ చేసుకుని, తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ వెబ్‌సైట్‌లో రిజిష్టర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ సదుపాయం ఐసిఐసిఐ కస్టమర్లకు మాత్రమే కా దు...ఎవరైనా వినియోగించుకోవచ్చు. గతంలో వివిధ టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహించే వెబ్‌సైట్లతో ఐఆర్‌సిటిసి ఒప్పందం కుదుర్చుకున్నా, ఓ బ్యాంక్‌తో అనుసంధానం కావడం మాత్రం ఇదే మొదటిసారి. ఐఆర్‌సిటిసిలో మాదిరిగానే వినియోగదారులు ఐసిఐసిఐలో కూడా ఇకపై రైల్ టికెట్లు బుక్ చేసుకోవడం, క్యాన్సిల్ చేసుకోవడం, పిఎన్‌ఆర్ స్టేటస్ తెలుసుకోవడం వంటివన్నీ చేసుకోవచ్చు. *