ఐడియా

ఆరోగ్యానికి బార్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సులువుగా జీర్ణమయ్యే పదార్థాల్లో బార్లీ ఒకటి. దాహాన్ని తీర్చడంలో బాగా ఉపయోగపడుతుంది.
* జ్వరంతో బాధపడేవారికి బార్లీ జావ మంచి ఆహారం. వీటిలో పోషకాలు అధికంగా వుండి త్వరగా జీర్ణమవుతాయి.
* మూత్ర పిండ సమస్యలు వున్నవారు బార్లీ జావను క్రమం తప్పకుండా కొన్నాళ్లు తీసుకొంటే యూరినరీ ఇన్‌ఫెక్షన్ల నుండి ఉపశమనం పొందవచ్చు. మూత్రపిండాలలోని రాళ్ళు కరిగిపోయేందుకు బార్లీ సహకరిస్తుంది.
* ఎండవేళ బార్లీ గింజలను ఉడికించి ఆ ద్రవాన్ని తాగితే దాహాన్ని, శరీర తాపాన్ని తగ్గిస్తుంది.
* ఇందులోని పీచు, ఫాస్పరస్ విటమిన్లు, ఎమినో ఆసిడ్స్ ఆరోగ్యానికి ఉపకరిస్తాయి.
* పేగుల్లోని చెడు బాక్టీరియాను తొలగిస్తుంది. కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించడానికి ఉపకరిస్తుంది.
* శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించే శక్తి వున్నందున మధుమేహం ఉన్నవారు
దీన్ని తీసుకోవచ్చు.
* రక్తపోటు, గుండె సంబంధ వ్యాధులున్నవారికి ఇది మంచి ఆహారం.
* కీళ్లనొప్పులు, అరికాళ్ల మంటలకు ఔషధంలా పనిచేస్తుంది.

-కెఎఆర్