ఐడియా

వంటింటి చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బ్రెడ్’ను కేవలం అల్పాహారంగా తినడానికే కాదు, వంటింటి చిట్కాలకు కూడా వాడవచ్చు. మిక్సీ లేదా గ్రైండర్‌లో మసాలా వాసన పోవాలంటే కాసిన్ని బ్రెడ్ ముక్కలు వేసి కొద్దిసేపు తిప్పాలి. ఆ తర్వాత నీటితో శుభ్రపరిస్తే మిక్సీలు, గ్రైండర్లలో ఎలాంటి వాసనా ఉండదు. గోడలకు తగిలించిన పెయింట్లు, వాల్ పేపర్లపై దుమ్ము,్ధళి పేరుకుపోయినా, నీరు లేదా నూనె పడినా బ్రెడ్ ముక్కలతో తుడిస్తే మరకలు అదృశ్యమవుతాయి. గచ్చుపై, డైనింగ్ టేబుల్‌పై నూనె పడిన వెంటనే బ్రెడ్ ముక్కలతో తుడిస్తే ఎలాంటి మరకలు పట్టవు. గ్రేవీలు వంటి వంటకాల్లో ఉప్పు ఎక్కువైందని అనిపిస్తే కాసిన్ని బ్రెడ్ ముక్కలు వేయాలి. బ్రెడ్ వేయడం వల్ల మరింత కమ్మటి రుచి వస్తుంది. ఇంట్లో గాజు గ్లాసులు, గాజు వస్తువులు కిందపడి ముక్కలైనపుడు బ్రెడ్ ముక్కలతో తీస్తే గాజుపెంకులన్నీ వాటికి అంటుకుని వచ్చేస్తాయి. పాలలో ముంచిన బ్రెడ్ ముక్కలతో రోజూ ముఖాన్ని మృదువుగా తుడుచుకుంటే మచ్చలు తొలగిపోయి, చర్మానికి మంచి నిగారింపు వస్తుంది.