ఐడియా

వంటింటి చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ గొంతు సమస్యలతో బాధపడేవారు రోజూ నాలుగైదు మిరియం గింజలను నోట్లో వేసుకుని ఆ రసం మింగితే మంచి ఫలితం ఉంటుంది.
ఆ గొంతు నొప్పితో బాధపడుతుంటే గ్లాసు వేడి నీటిలో ఉప్పు, చిటికెడు పసుపు కలిపి రోజుకు మూడుసార్లు పుక్కిలిస్తూ ఉంటే గొంతునొప్పి తగ్గిపోతుంది.
ఆ కాల్చిన అల్లం ముక్కలపై ఉప్పు లేదా దానిమ్మ రసం వేసుకుని తింటే నోరు పరిశుభ్రమవుతుంది. దానితో పాటు గొంతు నొప్పి తగ్గు ముఖం పడుతుంది.
ఆ ప్రతిరోజూ నీళ్లలో తులసి ఆకులు వేసుకుని తాగితే గొంతు ఇన్‌ఫెక్షన్ నుంచి బయటపడవచ్చు.
ఆ అల్లం ఎండబెట్టి పొడిచేసుకుని ఇందులో జీలకర్ర, పంచదార కలుపుకుని తింటే గొంతు సమస్యలు తగ్గుతాయి.
ఆ పల్చటి మజ్జిగను అపుడప్పుడు తాగుతుంటే కూడా వేడివల్ల వచ్చిన గొంతు నొప్పి తగ్గుతుంది.
ఆ ఎసిడిటీ సమస్య ఉన్నవారికి గొంతు మంటగా అనిపిస్తుంది. అట్లాంటి వారు ఖాళీ కడుపుతో ఉంటూ ఎక్కువగా కాపీ, టీలు తాగడం మంచిది కాదు.
ఆ కాసిని పాలల్లో చిటికెడు పసుపు కలుపుకుని వేడిగా తాగితే గొంతు సమస్య దూరమవుతుంది.
ఆ రోజు పరగడుపున నాలుగు వెల్లుల్లి రెబ్బలు నమిలితే కూడా గొంతు సమస్యలు దూరమవుతాయ.