ఐడియా

ఆకలి మందగించిందా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది పిల్లలు ఆకలి లేదు అని చెబుతుంటారు. స్కూల్ నుంచి వచ్చిన తరువాత ఏ చిప్స్ లాంటివైతే తింటారు కాని అన్నం కాని, మరేదైనా చిరుతిండి ని కూడా ఇష్టపడకుండా ఆకలి లేదు అనేస్తుంటారు. ఇలా వీరిని వదిలేయడం వల్ల వారి కడుపులో నులిపురుగులు చేరడం, లేదా జీర్ణశక్తి దెబ్బతినడం లాంటివి జరుగుతుంటాయి.
ప్రతిదానికి హాస్పటల్ కు పోకుండా ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలతో వారి ఆరోగ్యాన్ని బాగ చేసుకోవచ్చు. వాటిని ఇప్పుడు చూద్దాం.
వేడి వేడి అన్నంలో మిరియాల పొడి ఒక చంచాను వేసి నెయ్యి , ఉప్పు తగినంత వేసి కలిపి అప్పుడప్పుడు పిల్లలకు పెడుతూ ఉంటే వారిలో జీర్ణశక్తి బాగుంటుంది.
అట్లానే పరగడుపున శొంఠి ని బాగా పొడి చేసి వస్తక్రాగితం పట్టి అందులోకి ఉప్పు కాని, చక్కెర గాని కలిపి ఒక స్పూన్ పిల్లల చేత తినిపిస్తే అనారోగ్యాలు దరిచేరవు.
వామును నీళ్లల్లో మరగాచి అప్పుడప్పుడు వారి చేత తాగించుతూ ఉండాలి. దీనివల్ల కూడా అజీర్తి వల్ల కలిగే బాధలు ఉండవు.
ఇవే కాక పిప్పళ్లను దోరగా నేతితో వేయించి చల్లారాక పొడి చేసుకోవాలి. ఈ పొడిని వస్తక్రాగితంతో మెత్తని పొడి చేసుకోవాలి. ఆతరువాత అరచెంచా తేనె, చంచా నేయిని పావు అరచంచా పిప్పళ్ల పొడిలో కలిపి పొద్దునే్న పిల్లలకు తినిపించాలి. దీనివల్ల ఆకలి మందగించడం లాంటి సమస్యలు ఉండవు.
వర్షాకాలం, చలికాలం లాంటప్పుడు పిల్లలు ఎక్కువగా దగ్గుతోను, జలుబుతోనో ఉంటూంటారు. ఇలాంటివీరికి అపుడే దించిన అన్నంలో వెల్లుల్లి నాలుగు లేక ఐదు రెబ్బలను పెట్టి కాసేపు మూసి ఉంచాలి. ఐదు నిముషాలు అయిన తరువాత ఒకటిరెండు అన్నం ముద్దలు చేసి అందులో మెత్తగా అయిన వెల్లుల్లిని, నేతి వేయి కలిపి తినిపించాలి. దీనివల్ల నెమ్ము జలుబు లాంటివి దూరం అవుతాయి.