ఐడియా

చురుగ్గా ఉండాలంటే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరికైనా నేటి కాలంలో వ్యాయామం తప్పనిసరి. కాకపోతే మోనోపాజ్ కు చేరువ అవుతున్న మహిళలుమాత్రం వ్యాయామానికి మరింత ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిందే. లేనట్టయితే గుండెజబ్బులు, కండరాలు పట్టుకోవడాలు, మధుమేహం, ఇంకా ఇంకా అనేకానేక జబ్బులు వస్తుంటాయి. అట్లాకాక 30 ఏళ్ల వయస్సులో ఉన్నట్టుగానే ఉండాలి అంటే తప్పనిసరిగా పొద్దునే్న వాకింగ్ కి వెళ్లాలి. కనీసం అర్థగంట మీకోసం మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఆతరువాత దినసరి పనులు మొదలుపెట్టాలి. నిద్రలేవగానే నడక ఆ తరువాత మిగతా పనులు అని నియమం పెట్టుకోవాలి. ఒక్కోక్కసారి కొంతమంది తక్కువ దూరం నడిచినా సరే వారిలో ఎక్కువ చెమట పట్టేస్తుంటుంది. ఇలా చెమట పట్టగానే ఆహా నాకు చెమట ఎక్కువ పట్టేసింది కెలరీస్ తగ్గిపోయి ఉంటాయనుకొంటుంటారు. కాని ఈ చెమట శీతోష్ణస్థితి అంటే శరీరంలోని వేడిమి వల్ల వస్తుంటుంది. దీన్ని పట్టించుకోకూడదు. చెమట పట్టినా సరే అనుకొన్న నడక వేగం వీలైనంత తగ్గకుండా నడవాలి. నడక వల్ల శరీరంలోని ఒబెసిటీ తగ్గుతుంది. కొవ్వు కరుగుతుంది. చైతన్యం వస్తుంది.
ఈనడకతో పాటుగా ప్రతిరోజు పండ్లు తినడం అలవాటు చేసుకోవాలి. మొలకెత్తిన గింజలు, పచ్చి కూరలు తినడం అలవాటు చేసకొంటే కొలస్ట్రాల్ తగ్గుముఖం పడుతుంది. తినుబండారాల్లో ఉప్పుశాతాన్నిన తగ్గించుకుంటే గుండెజబ్బులుకూడా దూరమవుతాయి.
మహిళల్లో ఎక్కువగా పొట్టచుట్టూ కొవ్వు పెరుగుతుంది. దీన్ని తగ్గించుకునే వ్యాయామాలు కూడా చేస్తుండాలి. ప్రతిరోజు క్యారెట్, సొరకాయ వంటి పచ్చి కూరలు తినడం లేదా వీటి జ్యూస్‌ను తీసుకొంటే పొట్టదగ్గర కొవ్వు కరిగిపోతుంది. బ్రిస్క్‌వాక్ చేయడం కూడా శరీరానికి చురుగ్గా ఉంచడానికి వీలుకలుగుతుంది. సైక్లింగ్ చేయడం, గ్రీన్ టీ తాగడం లాంటి అలవాట్లు కూడా శరీరంలో కొలస్ట్రాల్ తగ్గిస్తాయ. శరీరాన్ని చురుకుగా చేస్తాయ.

- శ్రీలత