ఐడియా

చిరునవ్వుకు చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది అందమైన ముఖానికి కారణం పలువరుసే అంటారు. వీటిని ప్రతిరోజు బ్రష్ చేసుకోవడం తోపాటుగా కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే పంటి వలన వచ్చే వ్యాధులనుంచి దూరంగా ఉండవచ్చు. నోటి పరిశుభ్రత లేకపోవుట వలనగానీ, గార శుభ్రం చేయకపోవుటవలన గాని, ఆహార పదార్థములు ఎక్కువగా చిగుళ్ళ మధ్యలో ఇరుక్కోవటం వలన గాని, కొన్ని తరహా సూక్ష్మక్రిముల వలనగాని పంటినొప్పి, పళ్లు పుచ్చడం లాంటివి వస్తాయ. ఒక్కోసారి చిగుళ్లు వాపు వస్తాయ. చిగుళ్ల నుంచి రక్తం కారడం, ఇవి మరీ ఎక్కువైతే నోటి నుంచి దుర్వాసన కూడా వస్తుంటుంది.
ఇలాంటి లక్షణాలుంటే వెంటే డాక్టరు దగ్గరకు వెళ్లడం మంచిది. చిన్న వ్యాధులే అని నిర్లక్ష్యం చేస్తే పెద్దవ్యాధులకు దారితీస్తాయ. ఇట్లా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
-ప్రతి రోజు రెండుసార్లు శుభ్రంగా బ్రష్ చేసుకొనుట
-ఆహారం తీసుకున్న పిదప ప్రతీసారి పుక్కిలించటం
-పీచు పదార్థాలు కలిగిన ఆహారం తీసుకొనుట
- ముల్లంగి గింజలు రోజులో ఒకసారి నోట్లో వేసుకొని నములుతూ ఉంటే దంతాలవల్ల వచ్చే నొప్పి తగ్గుతుంది. దంతాలు గట్టిపడుతాయ కూడా.
- నువ్వుల నూనెతో సైంధవ లవణం కలిపి పుక్కిలిస్తే దంతాలు గట్టిపడుతాయ.
- గసగసాలు, పచ్చికొబ్బరి లేక అటుకులు అప్పుడప్పుడు నమిలితే నోటి పూత కూడా రాదు.
-అపుడపుడు జాపత్రిని కాసేపు నోట్లో వేసుకొని ఉంచితే దంతసమస్యలు బాధించవు.
- ఎక్కువ చల్లగాగాని, ఎక్కువ వేడిగా కానీ పానీయాలు సేవించకుండా ఉంటే మంచిది.
- వేడినీళ్లుగాని, టీ, కాఫీలు తాగినవెంటనే చల్లనీళ్లు, ఇతర పానీయాలు చల్లగా తీసుకోకూడదు.
-గోరువెచ్చని నీటితో చిగుళ్ళను మసాజ్ చేయటం-
ప్రతి ఆరు నెలలకు ఒకసారి దంతవైద్య నిపుణులను సంప్రదించి వారి సలహాలను పాటించాలి.
వీటిని దృష్టిలో పెట్టుకుంటే పంటి సమస్యలను అధిగమించవచ్చు