ఐడియా

పట్టులాంటి జుట్టు కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వానాకాలంలో జుట్టు తడవడం, తల జిడ్డుగా, అట్టకట్టినట్లు కనిపించడం మామూలే.. అలాగని రోజూ షాంపూ ఉపయోగించి తలస్నానం చేయడం జుట్టు ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకని అప్పుడప్పుడూ జుట్టుకు హెయిర్ ప్యాక్స్ వేస్తూవుండాలి. అప్పుడే జుట్టు అందంగా, ఆరోగ్యంగా, మెత్తగా పట్టుకుచ్చులా కనిపిస్తుంది.
* ఒక గినె్నలో గుడ్డు తెల్లసొనను తీసుకోవాలి. ఇందులో ఒక స్పూను తేనె, రెండు స్పూన్లు ఆలివ్ ఆయిల్ కానీ, కొబ్బరి నూనెను కానీ వేసి బాగా కలపాలి. దీన్ని జుట్టుకు ప్యాక్‌లా వేసి అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో స్నానం చేస్తే పట్టు కుచ్చులాంటి జుట్టు సొంతమవుతుంది.
* ఒక గినె్నలో రెండు పెద్ద చెంచాల ఓట్స్, కప్పు పచ్చిపాలు, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె కలిపి తలకు పట్టించాలి. ఒక పదినిముషాల పాటు తలను మృదువుగా మర్దన చేయాలి. తరువాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది. జిడ్డుగా మారిన తలకు ఈ ప్యాక్ చక్కని పరిష్కారం.
* బాగా పండిన అరటిపండును తీసుకుని గుజ్జులా చేయాలి. దీనికి తేనె, కాసిని పచ్చిపాలు, పెద్ద చెంచా కొబ్బరినూనె కలపాలి. దీన్ని తలంతా పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు మెత్తగా మారడమే కాకుండా జుట్టు చివర్లు చిట్లకుండా ఉంటాయి.
* పచ్చి కొబ్బరి నుంచి పాలు తీయాలి. అందులో చెంచా ఆలివ్‌నూనె, కోడిగుడ్డులోని తెల్లసొన కలిపి బాగా గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఆరిన తరువాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా, మెత్తగా ఉంటుంది.
ఇలా తరచూ చేయడం వల్ల కుదుళ్లలో ఎలాంటి మురికి చేరకుండా జుట్టు మెత్తగా పట్టుకుచ్చులా కాంతులీనుతూ ఉంటుంది.

--విశ్వర్షి 9393933946