ఐడియా

ఆస్తమా నివారణకు చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్తమా వ్యాధి వచ్చినవారికి ఊపిరితిత్తుల్లో గాలిప్రవాహంలో అడ్డంకులు ఏర్పడుతుంటాయి. దీంతో దగ్గు, గురక వంటి సమస్యలు వస్తుంటాయి. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈ చిట్కాలను పాటిస్తే ఆస్తమా వ్యాధి నుండి సమర్థవంతంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
* గ్లాస్ పాలలో రెండు వెల్లుల్లి రెబ్బలను వేసుకుని వాటిని బాగా మరిగించుకోవాలి. ఈ పాలను తీసుకోవడం వల్ల ఆస్తమా వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుంది.
* తాగే టీలో కొద్దిగా అలం, వెల్లుల్లి రసాలను వేసుకుని టీ రూపంలో తీసుకుంటే ఆస్తమా వ్యాధి నుండి విముక్తి పొందవచ్చు.
* ప్రతి రోజూ ఉదయానే్న గ్లాసు గోరువెచ్చటి నీటిలో కొద్దిగా తేనెను కలుపుకుని తాగాలి. దీనితో ఆస్తమా నుండి ఉపశమనం లభిస్తుంది.
* రాత్రివేళ నీళ్లల్లో కొద్దిగా మెంతులను నానబెట్టుకోవాలి. వాటిని మరుసటిరోజు ఉదయానే్న పరగడుపున తీసుకుంటే శరీరంలో ఏవైనా ఇనె్ఫక్షన్స్ ఉంటే తగ్గిపోతాయి.
* తులసి ఆకులను ఉదయానే్న తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
* ప్రతిరోజూ క్రమం తప్పకుండా కాఫీ తాగినా అందులోని ఔషధ గుణాలు శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.