ఐడియా

బరువు తగ్గాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధిక బరువు చాలామందిని వేధించే సమస్య. ముఖ్యంగా దక్షిణాదివారిలో ఈ సమస్య ఇంకా ఎక్కువ. ఆచితూచి తిన్నా సరే.. వారిలో నలభై సంవత్సరాల తర్వాత పొట్ట వచ్చి పడుతుంది. అదే ఉత్తరాదివారిలో అయితే ఈ సమస్య కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారు గోధుమ రొట్టెలను తింటారు. మసాలాలూ తక్కువే. అందుకే వారు బరువు తక్కువ పెరుగుతారు. మనం కూడా మన ఆహార పద్ధతుల్లో కొద్దిపాటు మార్పులు చేసుకుంటే బరువును తగ్గించుకోవచ్చు.
ఆధునిక కాలంలో అధిక బరువుకు ఓట్స్ పరమ ఔషధంలా మారాయి. ఉదయం పూట పాలల్లో ఓట్స్ వేసుకుని తినడం వల్ల బరువు పెరగరు. అలాగే మిగతా ఆహారపదార్థాల్లో కూడా ఓట్స్ శాతాన్ని పెంచాలి.
* నిద్ర లేచిన గంటలోపలే అల్పాహారాన్ని తినాలి.
* చికెన్, మాంసాలను తక్కువగా, చేపలను ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది.
* వారానికి మూడుసార్లు తప్పనిసరిగా గుడ్డును తినాలి.
* క్రమం తప్పకుండా రోజుకు అరగంట పాటు వ్యాయామం చేయడం వల్ల శరీరం తేలిగ్గా ఉండటమే కాకుండా జబ్బులు దరిచేరకుండా ఉంటాయి.
* పచ్చికూరగాయలు.. అంటే క్యారెట్, కీరా, కాలీఫ్లవర్ వంటివి కొవ్వును తగ్గిస్తాయి. పచ్చిబఠాణీ, శనగలు, పెసలు వంటివాటిని ఉడికించుకుని తినాలి.
* గ్రీన్ టీ చక్కటి ఆరోగ్యాన్ని, నాజూకైన శరీరాన్ని ఇస్తుంది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
* బార్లీ కూడా కొవ్వును బాగా కరిగిస్తుంది. వారానికి రెండు రోజులు బార్లీ జావను కానీ, వేడి నీటిని కానీ తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోవడమే కాకుండా మూత్ర పిండాల పనితీరు బాగుంటుంది.