ఐడియా

రోజూ రెండు గుడ్లు తింటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలు రకాల విటమిన్లు, ఖనిజాలు, బలాన్ని పెంచే ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి పుష్కలంగా లభించే గుడ్లను రోజూ రెండు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి పోషకాలు లేని పిజ్జాలు, బర్గర్లను తినిపించి పిల్లలను ఊబకాయులుగా మార్చే బదులు వారికి గుడ్లు ఇవ్వడం ఉత్తమం. యాపిల్స్‌లో కంటే రెండింతలు యాంటీ ఆక్సిడెంట్లు గుడ్డులో లభిస్తాయి. ఉడక బెట్టిన గుడ్లపై మిరియాల పొడి వేసి పిల్లలకు ఇస్తుండాలి. గుడ్లతో పలు రకాల ఆహార పదార్థాలను చేసుకుంటే

రుచితో పాటు శరీరానికి పోషకాలు అందుతాయి. అధిక బరువు ఉన్నవారు తప్ప మిగతావారంతా గుడ్డులోని పచ్చసొనను తినవచ్చు. రోజూ రెండు గుడ్లను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.
* గుడ్డులోని పోషకాలు, ఖనిజాల వల్ల క్యాన్సర్లు, గుండెజబ్బులను నివారించవచ్చు.
* ప్రొటీన్లు, మాంసకృత్తులు, అమైనో యాసిడ్లు అందడం వల్ల కండరాలు పుష్టిగా ఉంటాయి.
* సమతుల ఆహారమైన గుడ్లను అన్ని వయసుల వారు తినవచ్చు. వీటిని నూనెలో వేపి తినడం కన్నా ఉడకబెట్టి తినడం వల్ల పోషకాలు సవ్యంగా అందుతాయి.
* ఉడక బెట్టిన గుడ్లను చల్లారిన వెంటనే తినడం మంచిది. చాలాసేపు అలాగే వదిలేస్తే గుడ్లపై బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది.
* ఉడక బెట్టిన గుడ్లను ఫ్రిజ్‌లో అయితే రెండు, మూడు రోజుల వరకూ ఉంచుకుని తినవచ్చు.

*