ఐడియా

పిల్లలు నీళ్లు తాగాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లల్లో సగం మంది శరీరానికి అవసరమైనంత నీటిని తాగలేకపోతున్నారని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరోగ్య అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా నీళ్లు తాగని పిల్లల్లో మెదడు పనితీరూ.. మెదడు ఇతర అవయవాలతో సమన్వయం చేసుకునే తీరూ చురుగ్గా ఉండవని నిపుణులు అంటున్నారు. ఈ సమస్యకు ఓ చక్కని పరిష్కారం అందిస్తోంది ఇంటరాక్టివ్ వాటర్ బాటిల్. చూడచక్కని రంగుల్లో చూడగానే పిల్లల్ని ఆకట్టుకునే ఈ నీళ్ల సీసాలకు పైన ఒక తెర ఉంటుంది. ఈ నీళ్ల సీసా యాప్ సాయంతో పనిచేస్తుంది. యాప్‌తో అనుసంధానం చేసిన తర్వాత.. నింజా, సాన్సా, పర్పీ వంటి పాత్రల్లో ఒకదాన్ని పిల్లలు ఎంచుకోవచ్చు. అది పిల్లలు నీళ్లు తాగడం మొదలు పెట్టినప్పట్నుంచీ తెరపై కనిపించి ఆడుతుంది. ఇక అక్కడి నుంచి పిల్లలు సరైన సమయానికి నీళ్లను తాగుతూ ఉంటే వాటి సంఖ్య పెరుగుతూ కొత్త కొత్త సవాళ్లని అందుకుంటాయి. దీన్ని శుభ్రం చేయడం, ఛార్జింగ్ పెట్టుకోవడం కూడా తేలిక. కిందపడ్డా పగిలిపోదు. అలాగే ఇద్దరు పిల్లలు తమ నీళ్ల సీసాల్ని పక్కపక్కన పెడితే వాటిల్లోని పాత్రలు కూడా ఒకే తెరపై చేరి కలిసి ఆడుకుంటాయి. ఇన్ని వింతలున్న నీళ్లసీసా కనిపిస్తే పిల్లలు నీళ్లు తాగకుండా ఎందుకు ఉంటారు మరి..