ఐడియా

దివ్యౌషధం.. తమలపాకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమలపాకు, తాంబూలం.. పూజలకు మాత్రమే వాడతారని మనందరికీ తెలుసు. కానీ తమలపాకు ఔషధంగా కూడా పనిచేస్తుంది. నిత్య జీవితంలో తమలపాకును ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయో ఒకసారి చూద్దాం..
* కొన్ని తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడినీళ్లతో తీసుకుంటే బోదవ్యాధి తగ్గడానికి దోహదపడుతుంది.
* తమలపాకును పదిగ్రాముల మిరియం గింజలను కలిపి తిని, వెంటనే చల్లనీళ్లు తాగుతుంటే స్థూలకాయం తగ్గి సన్నగా, నాజూగ్గా తయారవుతారు.
* తమలపాకులను వేడిచేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తగ్గుతుంది.
* తమలపాకు జ్యూస్ తీసుకుంటే బలహీనత దూరమవుతుంది.
* తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదులో మూడు పూటలా మిరియం పొడి కలిపి తీసుకుంటే వైరల్ జ్వరం తగ్గుతుంది.
* వైరల్ ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా ఉండి గొంతు పూడుకుపోతే తమలపాకు రసం తీసుకుంటే కంఠం పెగులుతుంది. మాట స్పష్టతను సంతరించుకోవడమే కాకుండా కఫం తెగి వెలుపలకు వచ్చేస్తుంది.
* జలుబు చేసి చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్న సమయంలో తమలపాకును వేడిచేసి, దానిపై కొద్దిగా ఆముదాన్ని రాసి ఛాతిపై వేసి కడితే ఫలితం ఉంటుంది.
* తమలపాకులను పేస్ట్‌లా చేసి తలకు పట్టించి ఓ గంటసేపటి తర్వాత తలస్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గిపోతుంది.