ఐడియా

ఔషధాల గని.. బ్లూబెర్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్లూబెర్రీలో చాలారకాల ఔషధ తత్త్వాలు ఉన్నాయి. అంతేకాదు ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇవి సాధారణంగా అమెరికా, యూరప్, కెనడా, ఆసియాలలో పెరుగుతాయి. బ్లూబెర్రీ మొక్కలు పొదల్లా పెరుగుతాయి. ఈ పొదలను అనుసరించి వీటిని మూడు రకాలుగా వర్ణించారు.
* బ్లూబెర్రీ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
* మెదడు సామర్థ్యాన్ని పెంచడంలో బ్లూబెర్రీ ఎంతగానో సహాయపడుతుంది.
* దీనిలో కేన్సర్ వ్యాధిని తగ్గించే లక్షణాలు ఉన్నాయి.
* ఎక్కువకాలం యవ్వనంగా కనపడాలి అనుకునేవారు.. వారు పాటించే ఆహార ప్రణాళికలో బ్లూబెర్రీలను తప్పనిసరిగా కలుపుకోవాలి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అకాల వృద్ధాప్యాన్ని అడ్డుకుంటాయి. అంతేకాదు బ్లూబెర్రీలో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు మెదడు పనితీరును స్థిరీకరిస్తాయి.
* బ్లూబెర్రీలకు నీలిరంగును ఆపాదించే ఆంతోసైనిన్‌లు కేన్సర్ కారకపు ఫ్రీ రాడికల్‌పై దాడిచేసి, ట్యూమర్ పెరుగుదలను నియంత్రిస్తాయని అర్బానా-కాంపైన్‌లో ఉన్న ‘యూనివర్శిటీ ఆఫ్ ఎట్ ఇల్లినాయిస్’వారు తెలిపారు. కావున కోలన్ కేన్సర్ లేదా ఇతర కేన్సర్‌లను కలిగి ఉన్నవారు రోజూ బ్లూబెర్రీలను తినాలి.
* బ్లూబెర్రీలో వయసు సంబంధిత మతిమరుపు, అల్జీమర్స్ వంటి వాటిని తగ్గించి వేస్తుందని ఇంగ్లాండ్‌లో ఉన్న పెనిన్సులా మెడికల్ స్కూల్, యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్ వారు తెలిపారు. బ్లూబెర్రీలో ఉండే ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్‌లు దీనికి కారణం వారు చెబుతున్నారు. కాబట్టి ఎండిన బ్లూబెర్రీలను స్నాక్స్‌గా తీసుకోవడం చాలా మంచిది.
* బ్లూబెర్రీల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని మనకు తెలిసిందే.. ఈ ఫైబర్‌లు మలబద్ధకాన్ని నివారిస్తాయి. అంతేకాదు.. విటమిన్ ఇతర అన్ని రకాల పోషకాలను కలిగి ఉండే బ్లూబెర్రీలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
* టైప్-2 రకం మధుమేహవ్యాధి కలిగి ఉండేవారు బ్లూబెర్రీలను తినడం వల్ల రక్తంలోని చక్కెరస్థాయిలు నియంత్రణలో ఉంటాయని పరిశోధనల్లో రుజువైంది. రోజూ బ్లూబెర్రీలను తినే వారి రక్తంలోని చక్కెరస్థాయిలు తక్కువగా ఉంటాయి.