ఐడియా

అల్పాహారం తప్పనిసరి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయంపూట తీసుకునే అల్పాహారం మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. దీనివల్ల రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాదు.. బరువు కూడా అదుపులో ఉంటుంది. అయితే ఉదయం అల్పాహారంగా ఏవి తీసుకోవాలో, ఏవి తినకూడదో తెలుసుకుందాం..
మాంసకృత్తులు
అల్పాహారం అనగానే చాలామంది ఏది పడితే అది తినేస్తారు. కానీ మాంసకృత్తులున్న పదార్థాలు తింటే చాలా ఆరోగ్యం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ఇవి చాలా అవసరం. వీటిని తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు. వీటిని అల్పాహారంగా తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. గుడ్లు, బీన్స్, డ్రైఫ్రూట్స్, కూరగాయల నుంచి మాంసకృత్తులు లభిస్తాయి.
పిండిపదార్థాలు
అల్పాహారం త్వరగా తయారైపోతుందనే ఉద్దేశ్యంతో కొంతమంది బ్రెడ్, మైదా పదార్థాలను ఎంచుకుంటారు. వీటి నుండి శరీరానికి పీచు అందదు సరికదా.. త్వరగా ఆకలేసేస్తుంది. కారణం వీటిలోని పిండిపదార్థాలు.. వీటి వల్ల శరీర బరువు కూడా త్వరగా పెరుగుతుంది. అంటే పిండిపదార్థాలను అల్పాహారంలో తీసుకోకూడదని కాదు. శరీరానికి ఉపయోగపడే సంక్లిష్ట పిండిపదార్థాలు తినాలి అని అర్థం. అంటే.. గుడ్లు, ఓట్‌మీల్, పెరుగు, రాగిదోశ, గోధుమరవ్వ ఉప్మా వంటివి ఉదయం అల్పాహారంగా ఎంచుకోవచ్చు.
పండ్ల రసాలు
చాలామంది ఇంట్లో తయారుచేసుకున్న తాజాపండ్లు, కూరగాయల రసాలను అల్పాహార సమయంలో తీసుకుంటూ ఉంటారు. వీటి నుంచి శరీరానికి కావలసిన పీచు పదార్థం లభించదు. కాబట్టి నేరుగా పండ్లు లేదా సలాడ్‌లను అల్పాహారంగా ఎంచుకోవచ్చు. అప్పుడే వాటిలోని పోషకాలు, పీచు అందుతాయి. కడుపు నిండిన భావన కలుగుతుంది.
అలాగే చాలామంది ఉదయం అల్పాహారం అస్సలు తీసుకోరు. కొంతమందైతే వారికి కుదిరినప్పుడు అల్పాహారం తింటారు. ఈ రెండూ శరీరానికి మంచిది కాదు.. అంతేకాదు ఇలా చేయడం వల్ల మధ్యాహ్నం భోజనం ఎక్కువగా తినేస్తారు. దీంతో బరువు పెరిగే అవకాశం కూడా ఎక్కువ. కాబట్టి ఆలస్యం చేయకుండా, అసలు మానేయకుండా అల్పాహారం వేళకు తీసుకోవాలి. ఉదయం నిద్ర లేచిన గంట లోపలే ఆహారం తీసుకోవడం మంచిది.