ఐడియా

అందంగా.. ఆరోగ్యంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంట్లో ఏదైనా వేడుక ఉంటేనో, ఏదైనా పెళ్లికి వెళ్లాల్సి వస్తేనో మనకు అందంపై, సింగారంపై మోజు కలుగుతుంది. మనకు కావాల్సినప్పుడు అందం కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయదు. అందంపై అప్పుడప్పుడూ శ్రద్ధ తీసుకోవడం కాకుండా నిత్యం అందంపై శ్రద్ధ తీసుకుంటేనే నిత్యం యవ్వనంగా కనిపించడానికి సాధ్యం అవుతుంది. అంత సమయం ఎక్కడుందండీ.. అంటారా.. ప్రతిరోజూ దినచర్యలో భాగంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు అందంగా ఉండచ్చు.. ఫలితంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు.. ఎప్పుడంటే అప్పుడు వేడుకకు వెళ్లచ్చు.. కాబట్టి దినచర్యలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు.. ఎప్పుడూ యవ్వనంగా, అందంగా ఉండచ్చు. అవేంటో చూద్దామా..
* చర్మానికి ఏ సబ్బులను పడితే ఆ సబ్బులను వాడకూడదు. చర్మతత్త్వాన్ని బట్టి సబ్బులను ఎంపిక చేసుకోవాలి. పొడి చర్మం కలవారైతే సబ్బులకు దూరంగా ఉండటం మంచిది.
* కాలం ఏదైనా సరే.. అన్ని రకాల చర్మతత్త్వాల వారు సన్‌స్రీన్ లోషన్‌ను తప్పనిసరిగా ఎంచుకుని రాసుకోవాలి.
* కళ్ల కింద నల్లమచ్చలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఒత్తిడి, నిద్రలేమి కారణంగా ఇవి ఏర్పడతాయి. అందుకే ఎప్పుడూ ఒత్తిడి లేకుండా, కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ ధ్యానం, యోగా చేయాలి. ఇలా చేయడం వల్ల అందంగా, ఆరోగ్యంగా ఉండడం సాధ్యమవుతుంది.
* రాత్రి పడుకునేటప్పుడు తప్పనిసరిగా ముఖాన్ని క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోవాలి. లేదా పచ్చిపాలతో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఎండవల్ల నలుపుదనం పేరుకోదు. ముఖం ఎప్పుడూ తాజాగా ఉంటుంది.
* వారానికి ఒకసారి తప్పనిసరిగా నలుగు పెట్టుకోవాలి. దీనివల్ల చర్మంపై ఉన్న మృతకణాలు దూరమవుతాయి.
* అలాగే రోజూ తీసుకునే ఆహారంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, పీచు అధికంగా లభించే ఆహారం తీసుకోవాలి. యాపిల్, నిమ్మజాతి పండ్లు, చేపలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఇవన్నీ చర్మాన్ని తేమగా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.
* చేత్తో ముఖాన్ని తాకే అలవాటు ఉంటే దాన్ని వీలైనంత తగ్గించుకోవాలి. టిష్యూలు వాడటం అలవాటు చేసుకోవాలి. మురికి ఉన్న చేతులతో ముఖాన్ని తాకడం వల్ల ఇతర చర్మ సంబంధ సమస్యలు బాధించే ప్రమాదం ఉంటుంది.