ఐడియా

తెల్లటి దంతాల కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవ్వినా, మాట్లాడినా దంతాలు తెల్లగా, అందంగా కనిపిస్తే ముఖ సౌందర్యం మరింత ఇనుమడిస్తుంది. అందుకని దంతాలను ఎప్పుడూ తెల్లగా, ఎటువంటి మచ్చలు లేకుండా చూసుకోవాలి. దంతాలను తెల్లగా, ముత్యాల్లా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు..
* రాత్రి పడుకునే ముందు కూడా టూత్‌పేస్ట్‌పై కొద్దిగా బేకింగ్ సోడాను చల్లుకుని పళ్ళు తోముకుంటే.. పచ్చదనం పోయి, బాక్టీరియా తొలగి నోరు తాజాగా ఉంటుంది. దంతాలపై ఉన్న చిన్న చిన్న మచ్చలు కూడా తొలగిపోతాయి. బేకింగ్ సోడాను అతిగా కూడా ఉపయోగించకూడదు. ఎందుకంటే దంతాలపై ఉన్న ఎనామిల్ దెబ్బతింటుంది.
* మార్కెట్లో దొరికే స్ట్రాబెర్రీలను బాగా నమిలి తిన్నా కూడా దంతాలు శుభ్రపడతాయి. స్ట్రాబెర్రీలో ఉన్న గింజలు పళ్ళపై ఉన్న పచ్చదనాన్ని తొలగించి మెరిసేలా చేస్తాయి.
* చిన్న చెంచాతో ఉప్పు తీసుకుని అందులో రెండు, మూడు చుక్కల నిమ్మరసాన్ని కలిపి ఆ మిశ్రమంతో దంతాలను తోమడం వల్ల దంతాలు శుభ్రపడతాయి, మెరిసిపోతాయి. ఈ మిశ్రమం కూడా చిగుళ్ళకు అంటకుండా చూసుకోవాలి.
* చాలామంది టీ, కాఫీలు ఎక్కువగా తాగుతుంటారు. దంతాలు తెల్లగా మెరవాలి అనుకుంటున్నవారు రోజుకు రెండు సార్లకు మించి కాఫీ, టీలు తాగకూడదు. అలాగే పాన్, గుట్కాలు వంటివాటికి దూరంగా ఉండాలి. అప్పుడే దంతాలు తెల్లగా, ముత్యాల్లా అందంగా మెరిసిపోతాయి.