ఐడియా

నొప్పులను తగ్గించే చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నలభై సంవత్సరాలు దాటిన ప్రతి స్ర్తిలో మోకాళ్ల నొప్పుల సమస్య మొదలవుతుంది. కారణం విటమిన్-డి లోపం.. మనం ఏ పనిచేసినా మోకాలిపై భారం పడుతుంటుంది. ఇటీవల పెరుగుతున్న స్థూలకాయం, బహుళ అంతస్తుల్లో నివాసం, ఎగుడుదిగుడు ప్రాంతాల్లో నడక వంటి కారణాలతో మోకాలిలో నొప్పి సమస్య పెరుగుతోంది. అయితే వయసును బట్టి మోకాలినొప్పి బట్టి కూడా వస్తూ ఉంటుంది. సాధారణంగా 40 సంవత్సరాలు పైబడిన వారిలో మోకాళ్లనొప్పులు రావడం సాధారణం. మొదట కీళ్ల దగ్గర నొప్పి చిన్నగా మొదలై క్రమంగా నొప్పి తీవ్రత అధికం అవుతుంది. దీంతో వారు నడవడానికి, మెట్లు ఎక్కడానికి, పరిగెత్తడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నొప్పుల్ని తగ్గించుకోవడానికి చాలా రకాల మెడిసిన్స్ ఉపయోగిస్తారు. ఇలా ఉపయోగించడం వల్ల తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. కానీ ఈ మందులు దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తాయి. అందుకే వీలైనంత సహజ సిద్ధంగా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఆహార మార్పులు, క్రమం తప్పని వ్యాయామం, కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే మోకాళ్ల నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది.
* అల్లంలో అనాల్జెసి, యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది మోకాళ్లనొప్పులను నివారిస్తుంది. కాబట్టి కొద్దిగా అల్లం నూనెను మోకాళ్లపై పూసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. అలాగే మోకాళ్లనొప్పులు ఎక్కువగా ఉన్నవారు అల్లం టీలో కొద్దిగా పసుపు వేసుకుని వారానికి రెండుసార్లు తాగితే నొప్పులు తగ్గుముఖం పడతాయి.
* పసుపులో కూడా యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మోకాళ్లనొప్పులను, ఇన్ల్ఫమేషన్‌ను నివారించడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. మోకాళ్ల నొప్పులకు ఇది ఉత్తమ రెమిడీ.. గోరువెచ్చటి పాలల్లో పసుపు కలుపుకుని తాగడం వల్ల మోకాళ్లనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
* మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు నువ్వులనూనెలో నిమ్మరసాన్ని కలిపి కీళ్లపై మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది. అలాగే నిమ్మతో తయారుచేసిన పానీయాలను తీసుకోవడం మంచిది.
* ఆవనూనెను ప్రతిరోజూ రెండుసార్లు మోకాలు నొప్పి ఉన్నచోట రాస్తే ఉపశమనం పొందవచ్చు.
* రోజు మొత్తంలో ఒకసారి భోజనానికి ముందు రెండు స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకుంటే మంచిది. ఇందులో ఆల్కలిన్ లక్షణాలు ఉంటాయి. ఇవి మోకాళ్ల నొప్పిని తగ్గిస్తాయి.
* ఎప్సం సాల్ట్‌లో మోకాలి నొప్పిని తగ్గించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక బకెట్ వేడినీటిని తీసుకుని అందులో రెండు చెంచాల ఎప్సం సాల్ట్‌ను కలపాలి. ఇందులో పదిహేను నిముషాల పాటు కాళ్లను ఉంచాలి. నీళ్లలోనుంచి తీసిన తరువాత కాళ్లకు మాయిశ్చరైజర్ పూయాలి. ఇలా తరచూ చేస్తుంటే మోకాళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు.
* ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్ మోకాళ్ల నొప్పుల నివారణకు బాగా పనిచేస్తాయి. వారానికి కనీసం రెండు సార్లైనా చేపలను ఆహారంలో చేర్చుకోవాలి. చేపలు తిననివారు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే అవిసె గింజలు, బాదం, వాల్‌నట్స్, పొద్దుతిరుగుడు గింజల్ని తీసుకోవాలి.
* మోకాళ్లనొప్పులతో బాధపడేవారు తరచూ తేలికైన వ్యాయామాలను చేయాలి.
* కొన్ని యోగాసనాల ద్వారా మోకాళ్లనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉత్థాన పాదాసనం ద్వారా మోకాళ్లనొప్పులను తగ్గించుకోవచ్చు.