ఐడియా

బాలనెరుపు తగ్గించే చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరికి చిన్నవయస్సులోనే జుట్టు తెల్లబడుతుంటుంది. దీనే్న బాలనెరుపు అంటారు. ఒత్తిడి వంటి ప్రతికూల ప్రభావాలతో బాటు జుట్టు కూడా బలహీనపడి కాంతిని కోల్పోతుంది. నిజానికి జుట్టు రంగు ముందే నిర్ణయించబడుతుంది. జుట్టు కుదుళ్ళలోని మెలనోసైట్స్ అనే కణాలు జుట్టుకి రంగునిస్తాయి. శరీరంలోని మెలనిన్ స్థాయిని బట్టి జుట్టు రంగులు మారతాయి. వృద్ధుల్లో మెలనిన్ ఉత్పత్తి ఆగిపోయి జుట్టు తెల్లబడుతుంది. దీన్ని తిరిగి నల్లగా మార్చడం సాధ్యం కాదు. అయితే బాల్యం, యవ్వనంలో ఈ సమస్య వస్తే దాన్ని తగు చిట్కా వైద్యం, ఆహార నియమాల సాయంతో ఎదుర్కోవచ్చు.
* కరివేపాకు, గుంటగలగరాకు, పొన్నగంటికూరలను కలిపి మెత్తగా రుబ్బి తలకు రాసి ఆరిన తర్వాత తలస్నానం చెయ్యాలి. ఈ మిశ్రమంతోపాటు ఉసిరిని కూడా కలుపుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
* రెండు, మూడు కప్పుల నీటిలో గుప్పెడు రాచ ఉసిరికాయలు వేసి ఉడికిన తర్వాత గుజ్జుగా చేసి దానికి సమపాళ్లలో గోరింటాకు పొడి కలిపి కుదుళ్లకి పట్టించాలి. ఇలా వారానికి కనీసం మూడుసార్లు చేస్తే క్రమంగా తెల్లజుట్టు నల్లగా మారుతుంది.
* ఒక గినె్నలో నాలుగు చెంచాల చొప్పున నిమ్మరసం, కాఫీపొడి, గుడ్డుసొన, రెండు చెంచాల కొబ్బరినూనె, రెండు చెంచాల వడగట్టిన ఉసిరి రసం కలిపి మూడు గంటలపాటు అలాగే ఉంచాలి. తర్వాత దాన్ని జుట్టు కుదుళ్ళ మొదలు చివరల వరకు పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేస్తే తెల్లజుట్టు నల్లబడుతుంది.
* గుప్పెడు తులసి ఆకులను తీసుకుని ఒక కప్పు నీటిలో వేసి కాచిన తర్వాత ఆ నీటిని చల్లార్చి గోరువెచ్చగా అయిన తర్వాత ఆ నీటిని కుదుళ్ళలోకి ఇంకేట్లు రోజూ రాస్తూ ఉంటే జుట్టు నల్లగా మారుతుంది.
* రోజువారీ ఆహారంలో కరివేపాకును పచ్చడి, పొడి వంటరూపాల్లో విరివిగా వాడాలి.
* పరగడుపునే రుబ్బిన పచ్చి కరివేపాకు ముద్ద తీసుకుంటే మరింత మెరుగైన ఫలితం ఉంటుంది.
* బాలనెరుపు ఉన్నవారు రోజూ కప్పు ఉసిరికాయ రసం తాగితే జుట్టు కుదుళ్ళు బలపడటమే కాకుండా నెరుపు కూడా తగ్గుతుంది.
* వంద గ్రాముల వెల్లుల్లి పొట్టును బూడిద చేసి వంద మిల్లీలీటర్ల ఆలివ్ ఆయిల్లో కలిపి పదిరోజులు నిల్వ చేసి దాన్ని రోజూ రాత్రి తలకు రాసుకుని ఉదయం తలస్నానం చెయ్యాలి. ఇలా చేస్తూ ఉంటే తెల్లజుట్టు రాకుండా ఉంటుంది. *