ఐడియా
నల్లద్రాక్ష గుజ్జుతో మసాజ్...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ద్రాక్ష రసం ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు ద్రాక్ష రసం త్రాగడంవల్ల అందమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని సహజసిద్ధంగా అందిస్తుంది.
* విటమిన్ సి, ఎ, బి6, ఫోలిక్ ఆమ్లం, పొటాషియం, కాల్షియం, ఇనుము, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సెలీనియం లాంటి ఎన్నో రకాల ఖనిజ లవణాలు ద్రాక్షల్లో సమృద్ధిగా లభిస్తాయి. ఫ్లేవనాయిడ్స్ లాంటి శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్లు ఉండటంవల్ల ఫ్రీరాడికల్స్ బారినుంచి రక్షిస్తాయి.
* ద్రాక్షలో ఉండే ఔషధ గుణాలు ఆస్తమాను అదుపులో ఉంచుతాయి. ద్రాక్ష పండ్లలో టోరోస్టిల్‌బీన్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదును తగ్గస్తుంది. ద్రాక్ష పొట్టులో ఉండే సెపోనిన్లు కొలెస్ట్రాల్‌కు అతుక్కుని దాన్ని శరీరం గ్రహించకుండా నివారిస్తాయి.
* నల్లద్రాక్షల రసం రొమ్ము క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుందని ఇటీవలి అధ్యయనాలు తేల్చాయి. ద్రాక్షరసం క్యాన్సర్‌ను అణిచివేయడమేకాదు, క్యాన్సర్ కణాల వ్యాప్తిని కూడా అరికడుతుంది. ద్రాక్షలోని ఈ పదార్థాలు మొత్తం శరీర వ్యాధి నిరోధక వ్యవస్థనే బలోపేతం చేస్తాయి.
* అసిడిటి సమస్య ఉన్నవారు, ఒక గ్లాసు తాజా ద్రాక్ష రసంను రోజూ తాగాలి. ఆహారం అరగకుండా అజీర్ణతతో బాధపడుతున్నవారికి ద్రాక్ష రసాన్ని కానీ లేదా ద్రాక్ష పండ్లను కానీ తీసుకోవడంవల్ల అజీర్తిని అరికట్టడానికి సహాయపడుతుంది.
* ద్రాక్షలో సెల్యులోజ్, ఆర్గానిక్ ఆసిడ్ మరియు షుగర్ వంటివి మలబద్ధకాన్ని నివారించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అందువల్ల మలబద్ధకంతో బాధపడేవారు ద్రాక్షను తినడంవల్ల చాలా మేలు జరుగుతుంది. ద్రాక్ష రసం కడుపులోని ప్రేగులను శుభ్రపరచడంతోపాటు దీర్ఘకాలంగా ఉన్న మలబద్ధక సమస్యను నివారిస్తుంది.
* చర్మ సంరక్షణకు ద్రాక్ష పండ్లు ఎంతగానో ఉపకరిస్తాయి.