ఐడియా

బద్ధకం పోవాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితంలో ఓడిపోవడానికి ప్రధాన కారణం బద్ధకం. ఇది వ్యసనంలా మారితే మనిషి ఏ పనీ చేయలేదు. దీని నుంచి బయటపడాలంటే కొన్ని నియమాలు క్రమం తప్పకుండా పాటించాలి. అప్పుడే విజయం సొంతమవుతుంది.
* బోలెడంత పని కళ్ల ముందు కనిపిస్తున్నా.. కొన్నిసార్లు దాన్ని పూర్తి చేయాలనిపించదు. అలా వదిలేస్తే పని మరింతగా పేరుకుపోతుంది. మొత్తం ఒకేసారి చేయకపోయినా ఉన్న పనిని విభజించుకుని దశలవారీగా పూర్తిచేసుకుంటూ వెళ్తే సరి. సులువుగా పూర్తవుతుంది. చదువులో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.
* అన్నిపనులూ ఒకేసారి ముందేసుకుని కూర్చోడం వల్ల ఏ పనీ చేయలేము. మల్టీటాస్కింగ్ పద్ధతి పెద్దగా ఉపయోగపడదు. ఒత్తిడి పెరిగిపోతుంది. అందుకే కాస్త బద్ధకం వదిలించుకుని ఆ రోజు చేయాల్సిన పనుల జాబితాను ఉదయానే్న సిద్ధం చేసుకోవాలి. పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేసుకుంటే సరి. పడుకునేముందు వాటిలో ఎన్నింటిని పూర్తిచేశారో చూసుకుంటే సరి.
* తగినంత శక్తి లేకపోవడం, అలసిపోవడం మూలంగా బద్ధకం వస్తుంది. అందుకే రోజూ కనీసం ఏడు గంటల నిద్ర, పనిలో తగినంత విరామం అవసరం. శరీరానికి సమతులాహారం అందడం, తగినంత వ్యాయామం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు.
* కొన్నిసార్లు మనం చేసే పనికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించకపోవడం వల్ల కూడా బద్ధకం వస్తుంది. అందుకే ఏ పనైనా మొదలుపెట్టడానికి ముందు దానివల్ల కలిగే ప్రయోజనాలు, సాధించే లక్ష్యాల గురించి తెలుసుకోవాలి. *