ఐడియా

సొరకాయ తింటే ఆరోగ్య సమస్యలు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి ప్రసాదించిన కూరగాయల్లో సొరకాయ ఒకటి. వేసవి కాలంలో ఆరగిస్తే శరీరానికి చల్లదనం అందిస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ సి ఇందులో పుష్కలంగా లభిస్తుంది. ముఖ్యంగా ఇందులో జీవక్రియల్ని క్రమబద్ధం చేసే గుణం ఉంది. అందువల్ల ఇది పురుషుల పాలిట వరంగా ఉంది. వీర్యవృద్ధిని కలిగించడంలో సొరకాయ గింజల పాత్ర కీలకం. సొరకాయ ముదురు గింజలను వేయించి, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాలు, జీలకర్ర కలిపి నూరి కొంచెం అన్నంతో కలిపి తీసుకుంటే.. లైంగిక శక్తి పెరుగుతుంది. దీనివల్ల శారీరక దారుఢ్యం కూడా వృద్ధి చెందుతుంది. హృదయ సంబంధ వ్యాధులను అరికట్టడంలో సొరకాయ కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ తరచూ తింటే జలుబు చేస్తుందనుకుంటే.. శొంఠిపొడినిగానీ, మిరియాల పొడినిగాని కలిపి తీసుకుంటే మంచి గుణం కనిపిస్తుంది. సొరకాయ శరీరంలోని వేడినీ, కఫాన్నీ తగ్గిస్తుంది. వాంతులు, విరేచనాలు, పేగుపూత వంటి సమస్యలు ఉన్నవారు సొరకాయను తరచూ తింటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు.