ఐడియా

ఉప్పుతో ఉపయోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పు లేకుండా ఏ కూరనూ వండలేం.. తినలేం కూడా.. అయితే ఉప్పును కూరల్లోకే కాదు.. ఉప్పుతో ఇంకా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. అవేంటంటే..
* తరచుగా వేసుకునే బూట్లు వాసన వస్తుంటాయి. అలాంటప్పుడు రాత్రిపూట కొద్దిగా ఉప్పు చల్లి ఉంచాలి. పొద్దునే్న బూట్లను దులిపేసి వేసుకోవడం వల్ల దుర్వాసన రాదు.
* కొత్త బట్టలు రంగుపోకుండా ఉండాలంటే మొదటిసారి ఉతికేటప్పుడు కొద్దిగా ఉప్పు కలిపిన నీటిలో నానబెడితే చాలు.. రంగు వెలియవు.
* గుడ్డు, చేపలు వంటి పదార్థాలు నేలపై పడినప్పుడు ఆ పదార్థాలను తొలగించిన తర్వాత ఇంకా నీచు వాసన వస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు అవి పడిన చోట ఉప్పును చల్లి రుద్దితే నీచు వాసన తొలిగిపోతుంది.