ఐడియా
పెదవులు అందంగా..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తీర్చిదిద్దినట్లుండే పెదవుల వల్ల ముఖానికి కొత్తందం వస్తుంది. పెదవులను లిప్‌స్టిక్‌తో తీర్చిదిద్దుకోవడంలోకొన్ని మెలకువలు పాటించాలి. లిప్‌స్టిక్ వాడేముందు తెలుసుకోవలసిన మొదటి విషయం అసలు పెదవులకు ఎటువంటి లిప్‌స్టిక్ నప్పుతుందో అని.. అందుకోసం దాన్ని పెదవులకే వేసుకోవలసిన అవసరం లేదు. దాన్ని వేళ్లపై కొద్దిగా రాసుకుని పరీక్షించుకోవచ్చు. పెదవుల సహజ రంగు కన్నా, కాస్త ముదురు ఛాయలో ఉన్న లిప్‌స్టిక్‌ను ఎంచుకోవాలి. దీని ఎంపికలో హడావుడిగా కాకుండా ఒకటికి రెండుసార్లు పరీక్షించుకుని కొనుక్కుంటే బాగుంటుంది.
* పెదవులకు ముందుగా లైనర్‌ని వాడి ఆ తర్వాత ఎంచుకున్న ముదురు రంగు లిప్‌స్టిక్‌ను వేసుకోవాలి. అప్పుడే లిప్‌స్టిక్ చాలా సమయం నిలిచి ఉంటుంది. ఒకవేళ లేతరంగు లిప్‌స్టిక్ అయితే న్యూడ్ లైనర్‌నే వాడాలి.
* కళ్లకు బాగా కొట్టొచ్చినట్లుగా మేకప్ చేసుకుని దానికి అదనంగా ముదురు రంగు లిప్‌స్టిక్‌ను ఎంచుకుంటారు కొందరు. ఇలా చేయడం వల్ల చూడటానికి మేకప్ అతిగా, ఇబ్బందికరంగా కనిపిస్తుంది.
* పెదవులకు గాఢమైన ఎరుపురంగు లిప్‌స్టిక్ వేసుకోవాలంటే మిగిలిన మేకప్ చాలా సాధారణంగా ఉండాలి. అప్పుడే ఎబ్బెట్టుగా కనిపించదు. కళ్లకు గాఢమైన మేకప్ వేసుకుంటే పెదవులకు కేవలం గ్లాస్ లేదా లేతరంగు లిప్‌స్టిక్‌ను ఎంచుకోవాలి.
* కళ్లకు స్మోకీ మేకప్‌ను వేసుకుంటే పెదవులకు రంగు లేకుండా ఉండేట్లు చూసుకోవాలి. అందుకోసం పెదవులపై కేవలం కన్సీలర్‌ను మాత్రమే అద్దుకోవాలి.
* పెదవులు నిండుగా కనిపించడానికి ఫిల్లర్ చికిత్స చేయించుకోవాలని లేదు. పెదవుల అంచుల నుంచీ అంటే సహజ లిప్‌లైన్ వెలుపలి నుంచి లైనర్‌ని రాయాలి. అలాగే కింది పెదవి మధ్యలో కొద్దిగా గ్లాస్ అద్దుకుంటే చాలు.. పెదవులు నిండుగా కనిపిస్తాయి.
* లిప్‌స్టిక్ వేసుకోవడం పూర్తయిన తరువాత పెదవుల మధ్య మెత్తని టిష్యూ పేపర్‌ను పెట్టి అద్దుకున్నట్లు చేయాలి. ఇలా చేయడం వల్ల పెదవులకు ఉండే అదనపు లిప్‌స్టిక్ టిష్యూకి అందుతుంది.
* ఇలా చేయడం వల్ల పళ్లపై మరకలు కూడా పడకుండా ఉంటాయి.
* వయస్సు గడిచేకొద్దీ పెదవుల ఆకృతిలో తేడా వస్తుంది. అందుకే ఓ వయసు వచ్చాక మ్యాటీ లేదా గ్లాస్ వేసుకోకూడదు. కేవలం క్రీమ్ తరహా రకానే్న ఎంచుకోవాలి.
* లిప్‌స్టిక్ వేసుకోవడం పూర్తయిన తర్వాత ఐస్‌ముక్కను తీసుకుని పెదవులపై అద్దినట్లు చేయాలి. ఇలా చేయడం వల్ల చాలాసమయం వరకు లిప్‌స్టిక్ చెదరకుండా ఉంటుంది.