ఐడియా

హ్యాండ్‌బ్యాగు వాడుతున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతో ఇష్టపడి, ఖరీదు పెట్టి కొనే హ్యాండ్‌బ్యాగు ఎక్కువకాలం మనే్నలా చూడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
* వేడి, చల్లదనం, తేమ ఉన్న గదిలో హ్యాండ్‌బ్యాగును పెడితే గనుక దాని రంగు పోయి అది పాతదానిలా మారుతుంది. అవసరం లేనప్పుడు దాన్ని దిండుగలేబులో ఉంచి అల్మారాలో ఓ మూల భద్రపరచాలి.
* బ్యాగు ఆకృతి బాగుండాలంటే దాన్ని అవసరానికి మించిన వస్తువులతో నింపేయకూడదు. వస్తువులు బ్యాగులో చాలా మితంగా ఉండేలా చూసుకోవాలి.
* ఒక్కోసారి హ్యాండ్‌బ్యాగు చాలా పాతదానిలా కనిపిస్తుంది. అలాంటప్పుడు ఎండిపోయిన బ్రెడ్‌స్లైస్‌తో హ్యాండ్‌బ్యాగ్‌ను తుడిస్తే మురికి సులువుగా వదిలి కొత్తగా కనిపిస్తుంది.
* హ్యాండ్‌బ్యాగ్‌పై జిడ్డుమరకలు పడినప్పుడు టాల్కం పౌడర్ రాసి కాసేపటి తర్వాత తుడిచేయాలి. మరకలు పోతాయి.