ఐడియా

పొడిబారిన పెదవుల కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందమైన ముఖానికి అందాన్నిచ్చే పెదవులు వాతావరణ మార్పుల వల్ల తరచూ పొడిబారుతుంటాయి. ఈ సమస్యను గుర్తించి ఎప్పటికప్పుడు పెదవుల పరిరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే గులాబీ రేకుల్లా కోమలంగా ఉండాల్సిన పెదవులు గులాబీ ముళ్ళలా మారి ఇబ్బంది పెడతాయి. పొడి చర్మం ఉన్నవారిలో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే కోమలమైన, మెరిసే పెదవులు కోరుకునే యువతులు చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే సరి.
* మిగిలిన చర్మంపై ఉన్నట్టుగా పెదాలపై ఎలాంటి తైల గ్రంథులు ఉండవు కనుక ఇవి త్వరగా పొడిబారి బిరుసెక్కుతాయి. కాబట్టి వీటికి తాజా కలబంద గుజ్జు రాసి తేలిగ్గా మర్దన చేస్తే పెదవులకు తగినంత తేమ సమకూరి మెత్తబడతాయి.
* ప్రతిరోజూ పెదవులకు మీగడ రాసుకుంటే సున్నితంగా, మృదువుగా మారతాయి.
* ఆరిన పెదవులను తరచూ నాలుకతో తడపడం వల్ల పెదవులకు తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది గానీ దీనివల్ల పెదవులకు వేగంగా తేమను కోల్పోయి సున్నితత్వాన్ని కోల్పోతాయి.
* లేత కీరా దోసముక్కతో తరచూ రుద్దితే కూడా పెదవులకు తగినంత తేమ అందుతుంది.
* గ్రీన్ టీ బాగ్‌ను గోరువెచ్చటి నీటిలో ఐదు నిముషాలు ముంచి తీసి బిరుసెక్కిన పెదవులపై ఉంచితే గొప్ప ఉపశమనంతో పాటు పెదవులు మెత్తబడతాయి.
* పచ్చి బంగాళాదుంప ముక్కల్ని పెదవులకు రాసుకుంటే పెదవులు మెత్తబడటమే కాకుండా.. నల్లని పెదవులు గులాబీ రంగుకు మారతాయి.
* గాజు గినె్నలో చెంచా పెట్రోలియమ్ జెల్లీ వేసి వేడినీటిలో దాన్ని ఉంచాలి. జెల్లీ కరిగిన తరువాత దానిలో చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న డబ్బాలో వేసి స్టోర్ చేసుకుని లిప్‌బామ్‌గా వాడుకుంటే పెదవులు పగలకుండా ఉంటాయి.
* బిరుసెక్కిన పెదవులకు లిప్‌స్టిక్ రాసేముందు పాలలో ముంచిన దూదితో పెదవులను తుడిచి లిప్‌స్టిక్ రాస్తే పెదవులు నిగారించినట్లు కనిపించడమే కాకుండా ఎక్కువసేపు ఆ మెరుపు ఉంటుంది.