ఐడియా

కఫానికి తులసితో కట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తులసితో అనేక వ్యాధులను నయం చేసే సంపూర్ణ ఆరోగ్యాన్ని నిలబెట్టే అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. అయితే తులసి కోసం ఎక్కడో వెతికే పని లేకుండా, ఇంట్లోనే పెంచడం ద్వారా ప్రతిరోజూ తులసి ఆకులను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
* ప్రతిరోజూ ఉదయం నీళ్లలో తులసి ఆకులను వేసి మరిగించి ఆ నీటిని తాగడం వల్ల కఫ సమస్యలు తగ్గడమే కాకుండా శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
* ప్రతిరోజూ తులసి టీని తాగడం వల్ల గొంతు సంబంధ సమస్యలు, శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయ.
* తులసి వేరును, శొంఠిని సమతూకంలో తీసుకుని రెంటినీ మెత్తగా నూరి, కుంకుడు గింజ పరిణామంలో మాత్రలను తయారుచేసుకోవాలి. ఈ మాత్రల్ని ప్రతిరోజూ ఒకటి చొప్పున ఉదయానే్న గోరువెచ్చని నీటితో సేవిస్తే, చాలా రకాల చర్మవ్యాధులు తగ్గిపోతాయి.
* తులసి ఆకులను, పసుపునూ కలిపి మెత్తగా నూరి గాయాలపై రాస్తే తగ్గిపోతాయి. కేవలం గాయాలపైనే కాదు ముఖంపై ఉన్న మొటిమలకు, మచ్చలకు ఇది చక్కటి మందుగా పనిచేస్తుంది.
* తులసి ఆకు రసాన్ని ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తే కఫంతో వచ్చే దగ్గు తగ్గిపోతుంది.
* తులసి ఆకులను, పుదీనా ఆకులను కలిపి మెత్తగా చేసి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే ముఖంపై ఉన్న మచ్చలు తొలగిపోయి చర్మం నునుపుతేలి నిగారిస్తుంది.
* ఒక చెంచా తులసి గింజలను ఒక కప్పు నీటిలో వేసి కాసేపు ఉంచి తాగితే మూత్ర సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. మూత్రం సాఫీగా వస్తుంది. అలాగే మూత్రపిండ సమస్యలు తగ్గి కాళ్ల వాపులు తగ్గిపోతాయి.
* తులసి ఆకులను వేడి నీళ్లలో వేసి మరిగించి కొద్దిగా తేనెను కలిపి తాగడం వల్ల జీర్ణాశయం శుభ్రమవడంతో పాటు శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు సంఖ్య పెరుగుతుంది.
* తులసి, వెల్లుల్లిని నూరి వాటి రసాల్ని చెవిలో వేస్తే చెవిపోటు తగ్గిపోతుంది.
* ప్రతిరోజూ నాలుగైదు తులసి ఆకులు నమిలి మింగితే మానసిక ఆందోళన కూడా తగ్గుతుంది. అలాగే ప్రతి రోజూ తులసి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల, తులసి చెట్టుపై నుండి వచ్చే గాలిని పీల్చడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.