ఐడియా

ఆత్మీయ స్పర్శ అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుడిబుడి అడుగులతో ముద్దు ముద్దు మాటలతో బోసినవ్వులతో ఈ ప్రపంచంలోని ఆనందమంతా రాశులుగా పోసినట్టుండాల్సిన చిన్నారులు అందుకు భిన్నంగా ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోవడం, ఏదో తెలియని పరధ్యానం.. కొన్నిసార్లు కారణం లేకుండానే బిగ్గరగా ఏడవడం, పదే పదే మారాం చేయడం, తమను తామే గాయపర్చుకోవడం.. చేస్తుంటే తల్లిదండ్రులు తల్లడిల్లుతారు. పిల్లలకు వున్న ఈ రుగ్మతను ఆటిజం అంటారు. ఈ సమస్య వున్న పిల్లల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఏడాది వయస్సు వచ్చేసరికే తప్పటడుగులు వేయాల్సిన చిన్నారులు ఒకరి సాయం లేనిదే ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోతున్నారు.
అద్భుతాలు
పిల్లలకు చిన్నపుడు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ఆమడ్యూస్ మోజార్ట్, సర్ ఐజాక్ న్యూటన్, మైకెలాంజిలో లాంటి వాళ్లను ఆదర్శంగా చూపిస్తూ ఉంటాం. వాళ్లలా మీరు కూడా పెద్దయ్యాక పేరు గడించాలని పిల్లలకు చెప్తుంటాం. కానీ ఇక్కడ తెలియని విషయం ఏమిటంటే, మనం వారిలోని మేధావితనాన్ని మాత్రమే చూస్తాం. కానీ పైన చెప్పిన వాళ్లందరికీ చిన్నప్పుడు బుద్ధిమాంద్యం, ఐన్‌స్టీన్, న్యూటన్, మైకెలాంజిలో ఆటిజం బాధితులు. వాళ్లకు ఏదీ ఒక పట్టాన తలకెక్కేది కాదు. నలుగురిలో కలవలేరు. ముభావంగా ఉండేవారు. అవకాశాలను అందిపుచ్చుకుని అద్భుతాలు సృష్టించారు.
ఆటిజం పిల్లలు ప్రపంచ వ్యాప్తంగా ఏడు కోట్లమంది ఉన్నట్టు ఐక్యరాజ్యసమితి లెక్కల్లో తేలింది. మన దేశంలో కోటిమందికి పైగా ఆటిజంతో ఇబ్బందిపడుతున్నారు. వాస్తవానికి ఆటిజం చాలా సాధారణమైన కమ్యూనికేషన్ డిజార్డర్. దాన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. అలా అని నిర్లక్ష్యం చేసేదీ కూడా కాదు. ఆడి పాడే వయసులో పిల్లలు ముభావంగా ఉంటున్నారంటే, వారిలో ఖచ్చితంగా ఆటిజిం లక్షణాలు ఏ మేరకు ఉన్నాయనే అంచనాలు లేవు.
ఒక పాప పేరు చేతన. రెండేళ్లు దాటినా మాటలు పలకడమే లేదు. పేరు పెట్టి పిల్చినా కదలిక ఉండడంలేదు. కొన్నిసార్లు గట్టిగా అరుస్తూ చప్పట్లు చరిచి, అంతలోనే నిశ్శబ్దంగా ఉండిపోతుంది. ఇలా వింత వింతగా ప్రవర్తించడం చిన్నపిల్లల్లో సాధారణమే అని నిర్లక్ష్యం చేస్తే రెండేళ్ళు దాటేసరికి పరిస్థితి ముదిరిపోయింది. ఎందుకంటే ఆ చిన్నారి ఆటిజం అనే సమస్యతో బాధపడుతోంది. చేతన లాగే చాలామంది ఆటిజం వున్న పిలల్లో ఒంటరితనం ఎక్కువ. ఎన్నిసార్లు పిలిచినా పలకరు. అలికిడైనా తల తిప్పి చూడరు. కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడలేరు. ఏకాగ్రత ఉండదు. ఒకే వస్తువును పదే పదే గుండ్రంగా తిప్పుతుంటారు. తోటి పిల్లలతో కలవరు. గుంపులోకి అస్సలు వెళ్లరు. రెండేళ్ల వయసప్పుడే ఆటిజం తాలూకు ఛాయల్ని పసిగట్టవచ్చు.
ఆటిజం లక్షణాల్లో పసిపిల్లలు అకారణంగా ఏడ్వటం, గంటల తరబడి స్తబ్దుగా ఉండడం, తల్లిదండ్రులు పిలిచినా ముభావంగా ఉండడం, తెలిసినవారిని చూసినా నవ్వకపోవడం, బడి వయసు పిల్లలైతే పక్క పిల్లలతో కలవకపోవడం, ఎప్పుడూ ఒంటరిగా ఉండడం, పిలిస్తే పలకకపోవడం కనిపిస్తుంది. మనుషుల కంటే బొమ్మలు, వస్తువులపట్ల ఆసక్తి చూపడం, అడిగిన వెంటనే జవాబు ఇవ్వలేకపోవడం, సూటిగా చూడలేకపోతుంటారు. స్పష్టమైన భావోద్వేగాలేవీ వ్యక్తం చేయలేరు. మాటలు సరిగా రాకపోవడం, తాము లేదా ఎదుటివారు గాయపడినా పట్టనట్టు ఉంటారు. నడిచేటప్పుడు మునివేళ్ళతో మీద నడవడం, ఎదుటివారు అడగనిదే జవాబుగా చెప్పటం, అసందర్భంగా మాట్లాడడం ఎక్కువగా ఉంటుంది. ఏదైన ఒక వస్తువు లేదా బొమ్మపట్ల విపరీతమైన వ్యామోహం పెంచుకుంటారు. దాన్ని తీసేస్తే విపరీతంగా కోపం వస్తుంది. చేతులు, కాళ్ళు లేదా వేళ్ళు కాస్త అసహజంగా ఒకే తీరులో కదలిస్తుండడం కనిపిస్తుంది. తాము అడిగినవి ఇవ్వకపోతే అరవడం, కొంతమందిలో ప్రతిదానికీ భయపడడం, గాలికి తీగలాంటిదేన్నా కదులుతున్నా చూసి భయపడడం, చీమలాంటిది కనబడిన భయపడడం ఇలాంటివి పిల్లల్లో వుంటుంది. చిన్న చిన్న శబ్దాలకూ గట్టిగా చెవులు మూసుకోవడం, శబ్దాలు భరించలేకపోవడం వంటి భావోద్వేగపరమైన అంశాలు ఉంటాయి.
ఒకింత చికిత్స మరికాస్త శ్రద్ధ
పిల్లలకు చికిత్స కలిగిస్తూనే పిల్లల పట్ల శ్రద్ధను కలిగి వుంటే ఆటిజం పిల్లలతో అద్భుతలు సృష్టించవచ్చు. పిల్లల్లో భాషాపరమైన ఇబ్బందులు పోగొట్టి స్వేచ్ఛగా మాట్లాడగల స్థాయికి తీసుకెళ్లడం, పిల్లల్లో చురుకుదనం తేవాలి. కావలసిన ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ఆటిజం పిల్లల్లో దాగిన అద్భుత మేధాశక్తిని వెలికితీయడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమవంతు సహకారాన్ని పిల్లలకు అందించాలి.
ఆటిజం పిల్లలకు తగిన మందులు వాడటం, కౌన్సిలింగ్, శిక్షణ ద్వారా మానసిక పరిపక్వతను పెంచడం, పిల్లలకు తగు ఆహారాన్ని ఇవ్వటం ద్వారా మాత్రమే ఆటిజాన్ని అదుపు చేయవచ్చు. పిల్లలతోబాటు తల్లిదండ్రులు కూడా ఆటిజంపై శిక్షణ తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఇతర పిల్లలతో గొడవలు పడటం వంటివి చేస్తుంటే సైకోథెరపీ ద్వారా అదుపు చేయవచ్చు.

- డా॥ అట్లశ్రీనివాస్‌రెడ్డి 97039 35321