ఐడియా

లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వసంపదలకూ అధినేత్రి లక్ష్మీదేవి. ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరం రాని వాడు కూడా అష్టైశ్వర్యాలూ అనుభవిస్తాడు. అందుకని ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకుని అందుకు తగినట్లుగా నడుచుకుంటే అందరూ హాయిగా జీవించవచ్చు. అవేంటో తెలుసుకుని పాటిస్తే అమ్మ కృపతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. అదెలాగో చూద్దాం.
* ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ఎక్కడపడితే అక్కడ బట్టలు, వస్తువులు పడేయడం వల్ల ఇల్లంతా చికాకుగా ఉంటుంది. ఇలా ఉండటం అమ్మవారికి అస్సలు ఇష్టం లేదు. అందుకే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
* గుమ్మానికి పక్కనే చిందరవందరగా పాదరక్షలను విడవడం మంచిది కాదు.
* ఇంట్లోకి వచ్చేటప్పుడు గుమ్మాన్ని కాలితో తొక్కి లోపలికి రావడం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. అందుకే ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే ఈ పని చేయనివ్వరు.
* సూర్యోదయ, సూర్యాస్తమయాలలో నిద్రించేవారు, భుజించేవారు, పగటిపూట నిద్రించేవారు లక్ష్మీదేవి కృపకు నోచుకోరు.
* శుచి, శుభ్రత, సహనం కలిగి, ధార్మికంగా, నైతికంగా జీవించేవారు లక్ష్మీదేవికి ఇష్టులు.
* చిల్లర పైసలను, పువ్వులను నిర్లక్ష్యంగా పడేసేవారు, ముక్కోపులు, దురహంకారులు లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరంగా ఉంటారు.
* బద్ధకస్తులు, అతిగా మాట్లాడేవారు, అమితంగా తినేవారు, గురువులను, పెద్దలను అవమానించేవారు, అపరిశుభ్రంగా ఉండేవారు, జూదరులు, అతినిద్రాలోలురు ఇంటి ముంగిట్లో కూడా లక్ష్మీదేవి కాలిడదు.
* లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఆకుపచ్చని వస్త్రాలను ధరించి, ఆమెకు ఎర్రని వస్త్రాలను, పరిమళభరితమైన పూలను అలంకరించి, ధూపదీప నైవేద్యాలను సమర్పించి, పాలు, పాలతో చేసిన పదార్థాలను నివేదించడం శ్రేష్టం.
* బంగారాన్ని నడుము కింది భాగంలో ధరిస్తే లక్ష్మీదేవిని కించపరిచినట్లే. అందుకే కాళ్ల పట్టీలు, మట్టెలూ వెండివి మాత్రమే ధరించాలి.
* ఉసిరిపొడిని నీటిలో కలిపి తలస్నానం చేసి, శుచీ శుభ్రతలతో దేవీ భాగవతంలోని మహాలక్ష్మి క్షీరసాగరం నుండి ఆవిర్భవించిన భాగాన్ని అధ్యయనం చేయడం వల్ల పోయిన సంపదలన్నీ తిరిగి లభిస్తాయని శాస్త్రోక్తి.
* లక్ష్మీదేవికి నివేదించే పిండివంటలను నూనెతో కాకుండా నేతితో చేయడం శ్రేయస్కరం.
* ఇంట్లో లక్ష్మీదేవి నిలబడి ఉన్న పటం కాకుండా పద్మంలో కూర్చున్న పటం ఉంచుకోవాలి.
* క్షమాగుణం, శాంత గుణం అనే రెండు గుణాల్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఈ రెండు గుణాలు ఉన్నవారిని లక్ష్మీదేవి సదా అనుగ్రహిస్తుంది.