ఐడియా

కాలి పగుళ్లకు ఇంటి చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరీర భారాన్ని మోసే పాదాలు వర్షాకాలం బాగా ఇబ్బందులకు గురవుతాయి. ఈ సమస్య కేవలం ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్ళలో కూడా కనిపిస్తుంది. మొదట్లో ఇది పెద్ద సమస్యగా అనిపించకపోయినా తరువాత తరువాత ఇది పెనుసమస్యగా మారే అవకాశముంది. అందుకే ముందస్తుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పగుళ్ళను నివారించుకుంటే మంచిది. ఇంట్లోని వస్తువుల ద్వారానే పగుళ్ళను చక్కగా తగ్గించుకోవచ్చు. మనం నిర్లక్ష్యం చేసే శరీర భాగాల్లో పాదాలు ముందుంటాయి. శరీరాన్ని అంతటినీ మోసే పాదాలను మాత్రం అస్సలు పట్టించుకోము. పట్టించుకోకపోతే శరీరంలో మొదటిగా పాడయ్యేది కూడా పాదాలే.. ఫంగస్ ఎక్కువగా చేరేది కూడా పాదాల్లోనే.. కాబట్టి పాదాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాళ్లపై ఉండే చర్మంతో పోల్చితే.. పాదాలపై ఉండే చర్మం చాలా పల్చగా ఉంటుంది. అందుకే.. ఇవి త్వరగా డ్యామేజ్ అయి ముడతలు, పగుళ్లు వచ్చేస్తుంటాయి. ఏజింగ్ లక్షణాలు కూడా మొదటగా పాదాల్లోని కనిపిస్తాయి. పాదాల సంరక్షణకు ప్రతిరోజూ సన్‌స్క్రైన్ రాసుకోవడం చాలా అవసరం. అయితే.. ఇప్పటికే పాడైపోయిన పాదాలకు ఏం చేయాలో చూద్దాం.. ముందుగా పెడిక్యూర్ చేసి తరువాత ప్యాక్‌లను వేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల పాదాలు క్రమంగా మృదువుగా, అందంగా తయారవుతాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
* ముందుగా వెడల్పాటి టబ్‌లో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ఇందులో షాంపూ లేదా బాడీ వాష్ వేసి కలపాలి.
* గోర్లకు ఉండే నెయిల్ పాలిష్‌ను తీసేసి టబ్‌లో పదిహేను నిముషాల పాటు పాదాలను ఉంచాలి. ఇలా ఐదు నిముషాల పాటు ఉంచాలి.
* ఫ్యూమిక్ స్టోన్‌ను తీసుకుని స్క్రబ్ చేస్తూ అరికాళ్లలో ఉండే మృతకణాలను తొలగించాలి.
* పాదాల పైభాగాన్ని ఫూట్ స్క్రబ్‌తో కానీ, ఆలివ్ ఆయిల్ సాల్ట్ మిశ్రమంతో కానీ స్క్రబ్ చేయాలి. తరువాత పాదాలను గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
* ఇప్పుడు పాదాలకు ప్యాక్ వేసుకుని శుభ్రంగా కడిగేసుకుంటే పాదాలు మృదువుగా అందంగా తయారవుతాయి.
* పారాఫిన్ వ్యాక్స్‌కు ఆవనూనె లేదా కొబ్బరినూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని వేడిచేసి వ్యాక్స్ పూర్తిగా కరిగిన తరువాత స్టవ్‌పై నుండి దించి చల్లార్చాలి. దీన్ని పడుకోవడానికి ముందు పాదాలకు పట్టించి ఉదయానే్న కడిగేసుకోవాలి. దీంతో పాదాలు పగుళ్ళు లేకుండా మృదువుగా మారతాయి.
* వేపాకు యాంటీబయాటిక్. దీనిలో పాదాల పగుళ్ళ నుంచి రక్షణ కలిగించే యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే గుప్పెడు వేపాకుకు స్పూన్ పసుపును కలిపి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించి అరగంట తరువాత నెమ్మదిగా రుద్దుతూ పాదాలను శుభ్రంగా కడిగేసి, తడి లేకుండా తుడవాలి. తరువాత నూనెతో మర్దనా చేయాలి. ఇలా తరచూ చేస్తే పగుళ్ళు మాయమై పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి.
* బియ్యం పిండిలో కాస్తంత తేనె, యాపిల్ సిడార్ వెనిగర్‌ను చేర్చి పేస్ట్‌లా తయారుచేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత గోరువెచ్చని నీటిలో పాదాలను నాననిచ్చిన అనంతరం ఈ పేస్ట్‌తో పాదాలను బాగా రుద్ది శుభ్రంగా కడగాలి. తరువాత పాదాలను తడి లేకుండా తుడుచుకుని ఆలివ్ ఆయిల్‌ను పట్టించాలి. కాసేపటి తరువాత సాక్స్ వేసుకుని పడుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు చేస్తే పగుళ్ళు కనిపించమన్నా కనిపించవు.
* వంటల్లో ఉపయోగించే ఏ నూనెతోనైనా పగుళ్ళకు చెక్ పెట్టేయవచ్చు. ముందుగా పాదాలను గోరువెచ్చటి నీటిలో పదిహేను నిముషాలు నానబెట్టాలి. తరువాత ఫ్యూమిక్‌స్టోన్‌తో రుద్ది మృతచర్మాన్ని, మురికినంతా పోగొట్టాలి. తర్వాత మంచి నీళ్ళతో కాళ్ళను శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడిచి ఇంట్లో ఉపయోగించే ఏదో ఒక వంటనూనెను పట్టించాలి. తరువాత సాక్స్ వేసేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితాలు వస్తాయి.
* రోజ్‌వాటర్‌లో ఎ, డి, ఇ, సి, బి3 విటమిన్‌లు ఉంటాయ. ఇవి చర్మానికి పోషణని అందిస్తాయి. గ్లిజరిన్ చర్మాన్ని మృదువుగా తయారుచేస్తుంది. రోజ్‌వాటర్, గ్లిజరిన్‌ను సమాననిష్పత్తిలో తీసుకుని బాగా కలిపి నిద్రపోయేముందు పాదాలకు పూయాలి. ఉదయానే్న గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తుంటే కొద్దిరోజుల్లోనే పాదాల పగుళ్ళు తగ్గుతాయి.