ఐడియా

గ్యాస్‌ను ఆదా చేయాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలానికి అనుగుణంగా వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్నటివరకు నిలకడగా ఉన్న ధరలు.. నేడు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోతున్నాయి. అలా ధరలు పెరుగుతున్న వస్తువుల్లో గ్యాస్ కూడా ఒకటి. మొన్నటివరకు ఒక మోస్తరు ధర పలికిన గ్యాస్.. నేడు విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే.. అలాంటప్పుడు గ్యాస్‌ను ఎంత పరిమితంగా వాడుకుంటే అంత మంచిది. అలా అని వంటకాలు చేయకుండా ఉండటమని కాదు అర్థం.. వంటకాలు చేసే సమయంలోనే కొన్ని చిట్కాలు పాటిస్తే.. గ్యాస్ వృథా కాకుండా ఆదా చేసుకోవచ్చు. అలాగే.. వంటను కూడా త్వరగా ముగించుకోవచ్చు. అంతేకాదు వంటను ఎంతో రుచికరంగా, పోషక విలువలను కోల్పోకుండా చేసుకోవచ్చు. సరైన మంట, తగినంత నీరు, పాత్రలు, సరైన పదార్థాలు వంటి విషయాలపై పూర్తి అవగాహన ఉంటే.. రుచికరంగా వంటను చేసుకోవడంతో పాటు గ్యాస్‌ను ఆదా చేసుకోవచ్చు. ఒకవేళ ఈ అంశాలపై పూర్తి అవగాహన లేకపోతే అందుకు సంబంధించిన కొన్ని చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని తూచా తప్పకుండా పాటిస్తే.. గ్యాస్‌ను సులభంగా ఆదా చేసుకోవచ్చు. మరి అవేమిటో తెలుసుకుందాం.
* ముందుగా వంటకు కావలసిన అన్ని వస్తువులను సిద్ధం చేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్‌ను వెలిగించుకోవాలి.
* కాయగూరలను ఉడకబెట్టేందుకు తగినంత నీరు మాత్రమే వాడాలి. అలాకాకుండా ఎక్కువ నీరు పోసి వండితే.. అందులో ఉన్న పోషకాలు వృథా అవడమే కాకుండా గ్యాస్, సమయం కూడా వృథా అవుతుంది. ఫలితంగా వంట రుచికరంగా ఉండదు.
* ఏ వంటకానికైనా ప్రెషర్ కుక్కర్ వాడితే చాలా మంచిది. దీనివల్ల ఆహార పదార్థాల్లో పోషకాలు పోకుండా ఉంటాయి. పైగా గ్యాస్, సమయం రెండూ ఆదాఅవుతాయి.
* ఫ్రిజ్‌లో నుంచి తీసిన పదార్థాలను వేడి చేసేందుకు వెంటనే స్టవ్‌పై పెట్టకూడదు. ముందుగా వాటిని రూం టెంపరేచర్ వద్ద కొద్దిసేపు ఉంచిన తరువాత స్టవ్‌పై ఉంచి వేడిచేయాలి. అప్పుడవి త్వరగా వేడెక్కుతాయి. గ్యాస్ ఆదా అవుతుంది.
* స్టవ్ వెలిగించినప్పుడు మంట నీలిరంగులో ఉండాలి. అలాకాకుండా ఎరుపు లేదా ఆరెంజ్ రంగుల్లో మండుతుంటే.. గ్యాస్ వృథా అవుతున్నట్లు అర్థం. అప్పుడు వెంటనే గ్రహించి సర్వీసింగ్ చేయించాలి. ఒక్కోసారి గ్యాస్ అయిపోతున్నప్పుడు కూడా మంట ఎరుపు రంగులో వస్తూంటుంది. అది గమనించుకోవాలి.
* ఏదైనా వంటకం చేస్తున్నప్పుడు ఆయా పాత్రలపై తప్పనిసరిగా మూతలను వాడాలి. ఇలా చేయడం వల్ల పోషకాలు వృథా కావు. పదార్థాలూ త్వరగా ఉడుకుతాయి.
* ముఖ్యంగా స్టవ్‌ను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయిస్తుంటే మంట బాగా వచ్చి వంట త్వరగా అవుతుంది. దీనివల్ల గ్యాస్ ఆదా అవుతుంది. బర్నర్ రంధ్రాలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. మూసుకుపోయిన రంధ్రాల వల్ల వంట సమయం పెరిగి గ్యాస్ వృథా అవుతుంది.