ఐడియా

బంగాళా దుంపలో బోలెడు పోషకాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగాళాదుంపలో బోలెడన్ని పోషకాలు దాగున్నాయి. తొక్కే కదా అని తీసిపారేయకండి. దానితో విలువైన ప్రయోజనాలు పొందవచ్చు. బంగాళాదుంప తింటే బరువు పెరుగుతారనుకుంటారు. కాని ఈ దుంప చెక్కులో మేలుచేసే కొవ్వు, సోడియం లభిస్తాయి. ఇవి బరువు తగ్గటానికి ఉపయోగపడతాయి. అలాగే దుంపలో ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని క్యాన్సర్ కారకాలను గుర్తించి వాటిపై పోరాడతాయి. పీచు సమృద్ధిగా లభిస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న బంగాళా దుంపలతో ఎన్నోరకాల వంటకాలు తయారుచేస్తుంటాం. దీనితో తియ్యని హల్వా సైతం తయారుచేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పిల్లలకు ఆలూ హల్వా చేసిపెట్టండి. అది ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
కావల్సినవి : 250 గ్రాముల ఉడకబెట్టిన బంగాళాదుంపు ముక్కలు, 250 గ్రాముల పంచదార, 100 గ్రాములు నెయ్యి, 50 గ్రాములు కోయా, అర చెంచా యాలకుల పౌడర్, ఐదు బాదం పప్పులు, ఐదు జీడిపప్పులు.
తయారుచేసే విధానం: నెయ్యి వేడిచేసుకుని అందులో ఉడకబెట్టిన బంగాళాదుంపల ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. తరువాత కోయా కలిపి సన్నని సెగపై మూడు నిమిషాలు వేయించుకోవాలి. తరువాత పంచదార పౌడర్‌ను వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలు ఉడికిస్తే చిక్కగా అవుతుంది. వేడి వేడి ఆలూ హల్వా రెడీ అవుతుంది.