ఐడియా

ఇవి తింటే చర్మం కాంతివంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాల్మన్ ఫిష్: సాల్మన్ ఫిష్‌లో రిచ్ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ చర్మాన్ని సూర్య కిరణాల తాకిడినుంచి కాపాడి.. స్కిన్‌ను కాంతివంతంగా చేస్తాయి.

పెరుగు: చర్మ సౌందర్యానికి పెరుగు సహజసిద్ధమైన ఔషధం. పెరుగును ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా చుండ్రు తదితర చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

టమోటా : టమోటాలను తీసుకోవడం ద్వారా మీ చర్మంపై ముడతలకు చెక్ పెట్టడంతో పాటు స్కిన్ ప్రకాశవంతంగా తయారవుతుంది. చర్మాన్ని, కేశాలను సంరక్షించడంలో టమోటాలు కీలక పాత్ర పోషిస్తాయని న్యూట్రిషియన్లు అంటున్నారు. టమోటాలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ రక్షణకు ఎంతగానో తోడ్పడుతాయి.

గ్రీన్ టీ : గ్రీన్ టీలో యాంటి ఆక్సిడెంట్స్ మోతాదు అధికంగా వుంటుంది. ఇది శరీర బరువును పెరగనీయకుండా చేయడంతోపాటు చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.

కివీస్ ఫ్రూట్ : ఈ ఫ్రూట్‌లో సి విటమిన్ దాగి వుండటంతో మీ చర్మ రక్షణకు తోడ్పడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి కాంతిని, నిగారింపునిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.