ఐడియా

లవంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లవంగం రుచికి కారంగానూ, ఘాటుగాను ఉంటుంది. లవంగ నూనెను సబ్బులు, టూత్‌పేస్టులు, పరిమళ ద్రవ్య తయారీలో వాడుతున్నారు. కొన్ని పరిశ్రమలలోనూ ఇవి ఉపయోగపడుతున్నాయి. లవంగాలలో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. కనుక ఇది అనారోగ్యాల నివారణకు, నిరోధానికి, ఉపశమనానికీ ఎంతగానో ఉపయోగిస్తాయి. కొన్ని మందుల తయారీలో కూడా లవంగాలు వాడుతున్నారు.
- శరీరం మీద లేపనంలా రాస్తే క్రిములను నాశనం చేస్తుంది.
- అధిక దప్పికను అరికడుతుంది.
- భుక్తాయాసాన్ని నివారిస్తుంది.
- కడుపు ఉబ్బరానికి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
- పంటి నొప్పిని నివారిస్తుంది.
- పిప్పి పన్ను బాధకు ఉపశమనాన్ని కలిగిస్తుంది.
- పంటి చిగురుకు వాపు ఏర్పడినపుడు, లవంగ నూనెను రాస్తుంటే ఆ వాపు, బాధ తగ్గిపోతాయి. తలనొప్పిని నివారిస్తుంది.
- ఆహారపు అరుగుదలకు తోడ్పడుతుంది.
- మూత్రపిండాలు తమ పనిని నిర్వర్తించటానికి సాయపడుతుంది.
- శరీరంలోని మలిన పదార్థాలు విసర్జింపబడటానికి దోహదం చేస్తుంది.
- రక్తంలోని తెల్ల కణాలను వృద్ధి చేస్తుంది.
- లవంగం నమిలి ఆ రసాన్ని మ్రింగితే ఉదర సంబంధిత వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది.
- రోజుకు రెండు మూడు లవంగాలను నమిలితే అతి మూత్ర వ్యాధి కొంత తగ్గుతుంది.
- లవంగాన్ని కాల్చి బుగ్గన ఉంచుకుని ఆ రసాన్ని మింగుతూంటే టాన్సిల్స్ నొప్పి, వాపు తగ్గుతాయి.
- నోటి పూతను నివారిస్తుంది.
- ఆగకుండా ఎక్కిళ్ళు వస్తున్నపుడు లవంగం నమిలితే ఎక్కిళ్ళు ఆగిపోతాయి.
- పొడి దగ్గు, గొంతు నొప్పి తగ్గిపోతాయి.
- పడిశ భారానికి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
- నోట్లో అధికంగా నీరూరటాన్ని నివారిస్తుంది.
- లవంగాన్ని అరగదీసి ఆ గంధాన్ని కళ్ళకు కాటుకలా పెట్టుకుంటే, తలనొప్పి, పంటినొప్పి, పడిశ భారానికి ఉపశమనం కలుగుతుంది.

- కె.నిర్మల