ఐడియా

రాత్రిపూట అరటిపండు తింటున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేదవాడి నుంచి సంపన్నుల వరకు అందరూ ఇష్టపడే పండు ఇది. అరటి పండులో పొటాషియం అధికంగా వుంటుంది. శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ పండు కీలక పాత్ర పోషిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కండర బలోపేతానికి పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థకు మేలు కలిగిస్తుంది. ఇది సహజ యాంటాసిడ్‌గా పనిచేస్తుంది. కడుపులో మంట ఉంటే బాగా పండిన ఒక అరటి పండు తింటే తగ్గుతుంది. అరటి పండును భోజనం తర్వాత తీసుకోవడం చాలామంది చేసే పని. కానీ రాత్రి భోజనం తర్వాత మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే ఊపిరితిత్తుల్లో మ్యూకస్ ఏర్పడడానికి, జలుబుకు దారితీస్తుంది. అందుకే దీన్ని రాత్రిళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. దానికి బదులు మధ్యాహ్న సమయంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఖాళీ కడుపుతో అరటిపండు తింటే అసౌకర్యానికి కారణమవుతుంది.