ఐడియా

డాక్టర్‌తో పనిలేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజుకో యాపిల్ తింటే డాక్టర్‌తో పనిలేద్న మాట వినే వుంటారు. ఎందుకంటే యాపిల్‌లో ఉండేవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవి. మరీ ముఖ్యంగా ఇందులో పెక్టిన్ అనే ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. మలబద్ధకపు సమస్యను దూరం చేస్తుంది. అందుకే ఆరోగ్య ప్రదాతల్లో ఈ పండు కూడా ఒకటి. కానీ యాపిల్‌ను రాత్రివేళల్లో తినకపోవడమే మంచిది. యాపిల్‌లో వుండే ఆసిడ్స్ కడుపులో యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. అంతేకాదు, పెక్టిన్‌వల్ల రాత్రి వేళల్లో జీర్ణ వ్యవస్థపై భారం పడుతుంది. పెక్టిన్ కారణంగా అసిడిటీ మొదలవుతుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా యాపిల్స్ తీసుకోవడంవల్ల తేలిగ్గా జీర్ణమవుతుంది.
యాపిల్ తొక్క తీసేయవద్దు
యాపిల్‌లో 116 కేలరీలు, 5.4 గ్రాముల ఫైబర్, 239 మిల్లీ గ్రాముల పొటాషియం, విటమిన్ సి, 120 ఐయూల విటమిన్ ఏ, 4.9 మైక్రోగ్రాముల విటమిన్ కె ఉంటాయి. పొట్టు తీసేసిన యాపిల్‌లో 194 మి.గ్రా పొటాషియం, 2.3 గ్రాముల ఫైబర్, 8.6 మిల్లీ గ్రాముల విటమిన్ సి, 882 ఐయూల విటమిన్ ఏ, 1.3 మైక్రో గ్రాముల విటమిన్ కె ఉంటాయి. తొక్కు తీసేస్తే విలువైనవి తగ్గిపోతాయి. తొక్కలో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. కేన్సర్ కణాలపై పోరాడే ట్రిటెర్పెనాయిడ్స్, శ్వాసకోశ సమస్యలను నివారించే క్వెర్సెటిన్ అనే కాంపౌండ్ ఉంటాయి. అందుకే రోజుకో యాపిల్ తింటే ఊపిరితిత్తుల పనితీరు చక్కగా ఉంటుంది. అంతేకాదు క్వెర్సటిన్ రసాయనం జ్ఞాపశక్తిని కూడా రక్షిస్తుందని పరిశోధనల్లో తేలింది. ఇంకా తొక్కలో స్థూలకాయంపై పోరాడే ఉర్సోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది.