ఐడియా

ఏ వేళలో.. ఏ ఆహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేళకు ఆహారం తీసుకుంటే ఎలాంటి జబ్బులు మన దరిచేరవు కండరాలు బలోపేతం అయ్యేందుకు వ్యాయామాలు చేస్తుంటాం. అదే సమయంలో కండర నిర్మాణం సరిగా జరగాలంటే సరైన పోషకాలు అవసరం. అందుకే వ్యాయామం అనంతరం తీసుకునే అల్పాహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ రేషియో 2:1గా వుండాలి. ఎక్కువ సమయం అధిక శ్రమతో కూడిన వ్యాయామాలు చేసేవారికి ఈ రేషియో 3:1గా వుండాలి. ఎందుకంటే కార్బొహైడ్రేట్లు, గ్లైకోజెన్‌ను తిరిగి భర్తీ చేస్తాయి. గ్లైకోజెన్ అనేది శక్తినిచ్చేందుకు వీలుగా నిల్వవున్న గ్లూకోజ్. కండరాలను తిరిగి నిర్మించడంలో ప్రోటీన్లది కీలక పాత్ర.
సుదీర్ఘ సమావేశం తర్వాత
ముఖ్యసమావేశం..ఎపుడో పొద్దున్న మొదలైతే సాయంత్రంకు ముగిసింది. దీంతో కళ్లు బైర్లు కమ్మడం ఖాయం! ఇలాంటి సుదీర సమావేశాల తరువాత కొన్ని బాదం గింజలను తినాలి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు, కొంత ప్రోటీను భర్తీ చేస్తాయి. ప్రోటీన్లు శరీరంలోని కణాలను యాక్టివేట్ చేస్తాయి. అంతేకానీ సుగర్ వున్న పదార్ధాలను తీసుకోరాదు. కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్‌ను అందిస్తాయి. దాంతో మెదడుకు శక్తినిస్తాయి, కానీ ప్రొటీన్ అనేది సమావేశంలో ఏం జరిగిందో అది గుర్తుంచుకునేలా చేస్తుంది. ప్రోటీన్‌లో భాగమైన అమినోయాసిడ్ టైరోసిన్ అనేది ఓ న్యూరో ట్రాన్స్‌మిటర్. మెదడుకు శక్తి ఇవ్వడంలోను, అప్రమత్తతలోను కీలక పాత్ర పోషిస్తుంది.