ఐడియా

ఉసిరి జ్యూస్‌తో ఉపయోగాలెన్నో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమ్లా, దీనే్న ఇండియన్ గ్రూస్‌బెర్రీ అని కూడా పిలుస్తారు. తెలుగులో ఉసిరికాయ అంటారు. ఉసిరికాయలో పోషకాలు అత్యధికంగా ఉన్నాయి. పోషకాలు అధికంగా ఉండటంవల్ల ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఆ ప్రయోజనాలేంటో ఒకసారి తెలుసుకున్నారంటే ఈ ఉసిరికాయను తినకుండా, ఆమ్లా జ్యూస్‌ను తాగకుండా మాత్రం ఉండలేరు.
ఆమ్లాను జ్యూస్ రూపంలో తీసుకోవడంవల్ల చర్మంలో మంచి మెరుపు వస్తుంది. ఆమ్లాలో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఆమ్లా జ్యూస్‌లో ఉండే విటమిన్ సి, ఐరన్ వంటి పోషక పదార్థాలు ప్రాణాంతక వ్యాధులను దూరం చేస్తుంది. అలాగే వ్యాధినిరోధకతను పెంచుతుంది. ఉసిరికాయ తినడానికి కాస్త వగరుగా అనిపించినా, అందులో పోషకాలు, యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయన్న విషయం మర్చిపోకూడదు. ఇందులో వుండే యాంటీ ఆక్సిడెంట్స్, ఇతర ఏ పండ్లలో కానీ, వెజిటబుల్స్ కానీ లేవు. అలాగే ఇతర ఏ టానిక్‌కు సాటిరావు. కొవ్వును కరిగించుకోవడానికి సహాయపడుతుంది. జ్యూస్ మెటబాలిజం రేటు పెంచుతుంది. ప్రొటీన్ సింథసిస్ ఫ్యాట్ చేరకుండా చేస్తుంది. టాక్సిన్స్‌ను శరీరం నుండి తొలగిస్తుంది. ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది.
మలబద్ధకం తగ్గిస్తుంది. ఉసిరి జ్యూస్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడంవల్ల బౌల్ మూవ్‌మెంట్ చురుగ్గా మారుతుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా వుండటంవల్ల బౌల్ మూమెంట్ మెరుగ్గా పనిచేసి పెద్ద ప్రేగులోని టాక్సిన్స్‌ను ఎఫెక్టివ్‌గా బయటకు నెట్టేస్తుంది. ఇందులో వుండే ఫైబర్ కంటెంట్ అందుకు బాగా సహాయపడుతుంది.
అయితే పరిమితంగా మాత్రమే దీన్ని తీసుకోవాలి. ఇది అవాంఛిత టాక్సిన్స్‌ను బయటకు పంపేస్తుంది. హీమోగ్లోబిన్, ఎర్ర రక్తకణాలను పెంచుతుంది. ఇది నాచురల్ డిటాక్సిఫయర్‌గా పనిచేస్తుంది. ఇందులో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ గ్లోయింగ్ స్కిన్‌కు సహాయపడుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఆమ్లా జ్యూస్‌ను రెగ్యులర్‌గా తాగడంవల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. ఆమ్లా జ్యూన్‌లో వుండే విటమిన్ సి కంటి కండరాలను స్ట్రాంగ్‌గా మార్చి కంటిచూపును మెరుగుపరుస్తుంది.
డయాబెటిస్‌ను కంట్రోల్ చేస్తుంది
మీరు డయాబెటిస్‌తో బాధపడుతుంటే కనుక రెగ్యులర్‌గా డైట్‌లో ఆమ్లా జ్యూస్‌ను చేర్చుకోవడంవల్ల డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. ఆమ్లా జ్యూస్‌లో వుండే క్రోమియం కంటెంట్ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. ఇది ఇన్సులిన్ లెవెల్స్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఈ జ్యూస్‌లో కొద్దిగా పసుపు, తేనె చేర్చి తీసుకుంటే డయాబెటిస్ ఎఫెక్టివ్‌గా కంట్రోల్‌లో వుంటుంది.
గుండెకు మంచిది
ఆమ్లా జ్యూస్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడంవల్ల గుండెకు మంచిది. ఎలా అంటే ఇది శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. దాంతో గుండెకు సరఫరా అయ్యే రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది. ఆమ్లా జ్యూస్‌లో వుండే అమినో ఆసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. దాంతో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా దూరం చేస్తుంది. ఎముకల ఆరోగ్యానికి మంచిది. శరీరంలోని ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు కాల్షియం అవసరం. ఇందులో వుండే విటమిన్ సి కాల్షియం గ్రహించడానికి ఎక్కువ సహాయపడుతుంది. పీరియడ్స్‌లో బాక్‌పెయిన్, స్టొమక్ పెయిన్ వంటి నొప్పులను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. పొట్టను ప్రశాంతంగా మార్చుతుంది. ఉసిరి జ్యూస్‌ను తేనెతో చేర్చి తీసుకుంటే ఆస్త్మా తో పాటు శ్వాస సంబంధిత సమస్యలను కూడా నివారిస్తుంది. హెయిర్ ఫాల్, తెల్ల జుట్టు, చుండ్రు అనేక సమస్యలకు ఉసిరి దివ్య ఔషధం! క్యాన్సర్ లక్షణాలను నివారించడానికి ఇందులో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ ముఖ్యపాత్రను పోషిస్తాయి.