ఐడియా

బరువు తగ్గేయండి ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బరువు తగ్గాలంటే అందుకు ఇదీ అంటూ ప్రత్యేకంగా ఓ నియమం ఏమీ లేదు. బరువు తగ్గేందుకు ఎన్నో మార్గాన్నాయి. ఎవరికి అనువైనది వారు ఫాలో అయితే చాలు. బరువు తగ్గాలనుకుంటూ ఏమీ చేయలేక పోతున్నవారు పోషకాహార నిపుణులు చెబుతున్న ఈ చిట్కాల గురించి తెలుసుకోండి.
కార్బోహైడ్రేట్లను తగ్గించండి
కార్బోహైడ్రేట్లు, ఫాట్స్ బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. అందుకని వీటి మోతాదును తగ్గించి ప్రొటీన్‌తో కూడిన ఆహారాన్ని పెంచాలి. పాలల్లో ప్రొటీన్ పొడి వేసుకుని తాగినాసరే, ప్రొటీన్ షేక్స్ అయినా ఓకే. వీటివల్ల కడుపు నిండినట్టు వుంటుంది.
కేలరీలను కరిగించాలి
రోజువారీ శారీరక వ్యాయామాన్ని మించింది లేదు. ఈ కాలంలో ఎక్కువమంది కదలకుండా కూర్చుని పనిచేయడం ఎక్కువైపోయింది. ఇలా అయితే ఆరోగ్యానికి మహా ముప్పే. శారీరక వ్యాయామం చేయమన్నారుగా అని వ్యాయామశాల కోసం వెతకాల్సిన పనేమీ లేదు. రోజూ నిర్ణీత సమయం వేగంగా నడిచినా సరిపోతుంది.
మెటబాలిజం రేటును పెంచుకోవాలి
మెటబాలిజం వేగం పుంజుకుంటే మరిన్ని కేలరీలు ఖర్చయిపోతాయి. రోజువారీ వ్యాయామంతోపాటు మెటబాలిజం రేటును పెంచే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి. గ్రీన్ టీ, గ్రీన్ కాఫీ, గార్సినియా, అకాయ్‌బెర్రీ ల్లాంటివి.
మధ్యమధ్యలో బరువును చూసుకుంటూ వుండాలి. చిట్కాలు పాటించకముందు, పాటించిన తర్వాత వచ్చిన మార్పులను గమనించాలి. ఫలితాలనుబట్టి ఇంకా ఏమైనా మార్పులు చేసుకోవాలా? అనే విషయం స్పష్టమవుతుంది.