ఐడియా

పాదాలకు రక్షణ ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శీతాకాలం.. వేసవి కాలం.. కొందరిని వర్షాకాలంలోనూ కాలి పగుళ్ల సమస్య తీవ్రంగా వేధిస్తుంటుంది. ఈ సమస్య కారణంగా చూడడానికి పాదాలు ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. స్ర్తిలకు అందమైన పాదాలు ఓ పెద్ద అసెట్ అని తెలిసిందే కదా.. చాలామంది రకరకాల చిట్కాలు పాటిస్తుంటారు.. మరికొందరు వైద్యుల సలహాలతో వివిధ రకాల మందులు వాడినా ఆశించిన ఫలితం లేక విసుగు చెందినవారూ వుంటారు. అలాంటివారికి నిపుణులు సూచిస్తున్న ఈ చిట్కాలను గురించి తెలుసుకుందాం.
తగినంత తేమ లేకపోవడం, ఎక్కువగా తడిలో పాదాలు నానుతుండడం, మురికికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ కావడం కాలి పగుళ్ల సమస్యకు ప్రధాన కారణాలు. అధిక శాతంమందికి పాద సంరక్షణపై పెద్దగా శ్రద్ధ వుండదు. పగుళ్ల సమస్యను నిర్లక్ష్యం చేస్తే పాదాలు ఎర్రబారి, వాచి తీవ్రమైన నొప్పికి దారితీస్తుంది. ఫంగల్ ఇనె్ఫక్షన్‌కు కూడా దారి తీయవచ్చు.
* కొవ్వొత్తి వెలుగు నివ్వడమే కాదు పాదాలకు ఓ రూపునిస్తుంది. మైనం ఆవనూనెతో కలిపి రాత్రిపూట పగుళ్లపై రాసి చూడండి. తెల్లవారేసరికి మార్పును గమనిస్తారు.
గ్లిజరిన్, రోజ్‌వాటర్‌తో కలిపి ప్రతిరోజు రాత్రి నిద్రించడానికి ముందు.. అలా 15రోజులపాటు రాసి చూడండి.
నువ్వుల నూనె కూడా ఈ సమస్య నివారణకు పనిచేస్తుందట. నిద్రించే ముందు పాదాలకు మర్దన చేయాలి.
అరటిపండు గుజ్జు కూడా పగుళ్లపై మంచి ఔషధంగా పనిచేస్తుంది. పగుళ్లు తొందరగా మానిపోయేలా చేస్తుంది.
పసుపు, తులసి, కర్పూరం సమాన మొత్తాల్లో తీసుకుని వీటికి అలొవెరా జెల్ కలిపి రాసి చూస్తే మంచి ఫలితం వుంటుందని అంటున్నారు నిపుణులు.