ఐడియా

వెల్లుల్లితో బరువు తగ్గండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉల్లి చేసే మేలు తల్లి చేయదు అని అంటారు. వెల్లుల్లితో నెలలోనే మూడు కిలోల బరువు ఈజీగా తగ్గించుకోవచ్చు. చాలామందికి పిట్‌గా ఉండాలని, ఏ డ్రెస్స్ వేసుకున్నా అందంగా కనిపించాలనే కోరిక ఉండటం సహజం. కాని ఊబకాయం వల్ల అసహనానికి గురవుతుంటారు. ప్రస్తుతం ఆడ,మగ అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఊబకాయం వల్ల అనేక అనారోగ్య సమస్యలు సైతం చుట్టుముడతాయి. మనకు తెలియకుండానే అధిక రక్తపోటు, డయాబెటిస్, జాయింట్ పెయిన్స్, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవరుచుకునేందుకు ఊబకాయం నుంచి బయటపడాలి. వెల్లుల్లిపాయ తింటే బరువుతగ్గించుకోవచ్చని ఎన్నో అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రోస్ట్ చేసిన ఆరు వెల్లుల్లి రెబ్బలు ప్రతిరోజూ తినటం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. ఉదయం పరగడుపున ఈ పేస్ట్ తింటే మంచిది. పచ్చి వెల్లుల్లి రెబ్బలు ఆరింటిని పొట్టు తీసుకుని ముక్కలుగా చేసుకోండి. తేనెను కలిపి పేస్ట్ వలే చేసుకోండి. ఇలా నెల రోజుల పాటు చేయండి. దీంతో మీ బరువులో తేడా ఖచ్చితంగా కనిపిస్తోంది. వెల్లుల్లి పేస్ట్‌తో పాటు ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తింటే మంచిది. ప్రతిరోజూ కనీసం ఒక గంట వ్యాయామం చేయాలి. వెల్లుల్లిలో అలిసిన్ ఉంటుంది. ఇది కొవ్వును వేగంగా కరిగించటానికి ఉపయోగపడుతుంది. తేనెలోని ఆమ్లజనకాలు కూడా శరీరంలోని కొవ్వు నిల్వలు తగ్గటానికి ఉపయోగపడతాయి. ఫలితంగా నెలలోనే మూడు కిలోల బరువు తగ్గుతారు.