ఐడియా

ఉప్పు అవసరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోడియం క్లోరేడ్ అనేది మన రక్తంలో ప్రతీ 100 మిల్లీ లీటర్‌కు గాను 0.9 గ్రాములు ఉంటుంది. శరీరంలో కొన్ని క్రియలు జరగటానికి సాల్ట్ చాలా అవసరం. ఎర్ర రక్తకణాల నిర్వహణకు, ప్రొటీన్లు కరగడానికి ఇది చాలా అవసరం. శరీరంలో నీటిశాతం తగినంత ఉంటేనే మన శరీర ఉష్ణోగ్రతలు కూడా సమ స్థితిలో ఉంటాయి. సోడియం అయాన్లు నీటి శాతాన్ని సరైన స్థాయిలో ఉంచేలా చూడటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. నాడీ ప్రేరణలకు ఇవి చోదకంగా పనిచేస్తాయి. గుండెలో హృదయ స్పందనలకు వీలుగా చాలా తక్కువ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంటుంది. ఈ విద్యుత్ చర్యలకు సోడియం అయాన్లు అవసరం. తీసుకున్న ఆహారం జీర్ణం అయ్యేందుకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అవసరం. ఇది ఏర్పడడానికి సోడియం సహకరిస్తుంది. వాంతులు, విరేచనాలు అయినవారిలో సోడియం, పొటాషియం లవణాలు తగ్గిపోయి నీరసించిపోతారు. జీర్ణాశయంలోని స్రావాల్లో యాసిడ్ సమతుల్యతకు సోడియం ఎంతో అవసరం.