ఐడియా

జామలో పోషకాలు మెండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నారులనుండి పెద్దలవరకూ ఇష్టపడే జామకాయలో పోషక విలువలు మెండుగా వున్నాయి. ఇపుడు మార్కెట్లో విరివిగా దొరుకుతాయ. విటమిన్ సి, ఇనుము జామలో అధికంగా వున్నాయి. దగ్గు, జలుబు, ఇన్‌ఫెక్షన్లు రావు. విటమిన్ సి వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పచ్చికాయలో విటమిన్ల శాతం అధికంగా వున్నాయి. పచ్చి జామ జ్యూస్ త్రాగడం చాలా మంచిది. రోజుకు ఒక జామకాయ తింటే ఆరోగ్యం, ఆయుష్షు మెరుగుపడుతుందని ఆయుర్వేదంలోనూ వివరించారు. అధిక బరువు సమస్య రాకుండా చేస్తోంది. జీర్ణశక్తి పెంచుతోంది. చిన్నపిల్లలకు గర్భిణీ స్ర్తిలకు మేలైనవి.కండరాలకు నరాలకు ఉపశమనం కలిగించే గుణాలు అధికంగా వున్నాయి. కంటిచూపునకు దోహదపడే విటమిన్ ఏ జామలో పుష్కలంగా ఉన్నది. పంటినొప్పికి జామ ఆకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. జామ ఆకుల్ని మెత్తగా నూరి చిగుళ్ళకు పట్టించుకుంటే నోటిలోని చెడు బాక్టీరియా పోతుంది. రక్తప్రసరణ సవ్యంగా జరిగటానికి దోహదపడే పొటాషియం జామలో వున్నాయి. పీచు పదార్థములు 12 శాతం లభిస్తాయి. మధుమేహం దరిజేరనీయదు.