ఐడియా

అన్ని రుచులు అలవాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న పిల్లలకు అన్ని రుచులు అందేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లి మీద ఎంతైనా ఉంది. ఏడాది వయసు వచ్చిన తరువాత సాధారణంగా ఇంట్లో తినే ఆహార పదార్థాలను ఒక్కొక్కటి ఆహారంలో చేరుస్తుండాలి. పిల్లలకు ఎదిగే వయసు నుంచే రుచి తెలుస్తుంది. మంచి ఆహార అలవాట్లకు పునాది పడేది ఇపుడే. కొన్నింటి విషయంలో మొహం తిప్పుకుంటుంటే వాటిని పక్కన పెట్టేయకండి. అలా చేస్తే అది జీవితాంతం నిషేధ పదార్థంగా ఉండిపోవచ్చు. ఒకవేళ ఏదైనా ఆహార పదార్థం సరిపడటం లేదని భావిస్తే పిల్లల వైద్య నిపుణులకు తెలియజేస్తే వారు తగిన సూచనలు చేస్తారు. ఎదిగే వయసు కాబట్టి పండ్లు, ఆకుకూరలు, గుడ్లు, కూరగాయలు, పెరుగు పెట్టడం మంచిది.