ఐడియా

అల్పాహారం పట్ల అశ్రద్ధ వద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి యాంత్రిక జీవనంలో పిల్లలు ఉదయానే్న టిఫిన్ తినటం అనే అలవాటునే మానేశారు. స్కూలు, ఆటలు, ట్యూషన్స్, అదనపు ప్రావీణ్యాల్లో శిక్షణ వంటివాటితో ఉన్న శక్తి అంతా ఆవిరైపోతుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని పోషకాహార నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఉదయం బ్రెడ్ స్లయిస్, దోశ, అటుకులు, అన్ని రకాల అల్పాహారాలు, పాలు, పాల పదార్థాలు, గుడ్లు, సోయామిల్క్‌ను ఏ రూపంలో అయినా తీసుకోమని సలహా ఇస్తున్నారు. పాలు రోజూ 150 ఎంఎల్, పెరుగు రోజుకు వంద గ్రాములు, పనీర్, చీజ్, కూరగాయలు, సీజనల్‌గా దొరికే పండ్లు, యాపిల్, క్యారెట్, పచ్చి బఠానీలు తీసుకోమని చెబుతున్నారు. ఉదయమే మిల్క్‌షేక్, పండ్లు లేదా పాలతో కార్న్ ప్లేక్స్ లేదా ఓట్స్‌కలిపి తీసుకోవచ్చు. అటుకులను కూరగాయలతో కలిపి తీసుకుంటే మంచిది. ఆమ్లెట్, చపాతీ కలిపి తీసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం పిల్లలు రోజులో నాలుగుసార్లు ఫుల్‌మీల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆహారం కూడా తాజా పండ్ల రసాలు, ప్రొబయోటక్ పెరుగు, కూరగాయలు, (రసాలు, ఉడకబెట్టిన రూపంలో) కలిపి తీసుకోవాల్సి ఉంటుంది.