ఐడియా

మొటిమలను తగ్గించుకుందాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీనేజీ నుంచి మధ్యవయస్సు అమ్మాయిల వరకూ దాదాపుగా అందరూ ఎదుర్కొనే చర్మ సమస్యల్లో అతి ముఖ్యమైన సమస్య మొటిమలు. చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే ఈ సమస్య దరిచేరకుండా చేయవచ్చు. మొటిమలను తగ్గించనూవచ్చు.
* రోజుకి రెండుసార్లు ముఖాన్ని సబ్బుతో కడగాలి. మరో నాలుగైదుసార్లు ముఖంపై చల్లటి నీటిని చిలకరించుకుంటూ ఉంటే ముఖం శుభ్రపడి మొటిమలు వచ్చే అవకాశం తగ్గుతుంది.
* తలపై చుండ్రు ఉన్నట్లయితే ముందు దాన్ని తగ్గించుకోవాలి.
* ఒత్తిడికి గురికాకుండా ఉండాలి.
* ముఖానికి మేకప్ ఎక్కువగా వేసుకోకూడదు. దీనివల్ల చర్మరంధ్రాలు మూసుకుపోతాయి. రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని మాయిశ్చరైజర్ పూసుకుని పడుకోవాలి.
* పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. నీళ్ళను ఎక్కువగా తాగాలి. ఆకుకూరలు తినాలి. ఫ్రైలను మానేయ లి.
* సబ్బులను, క్రీములను తరచూ మార్చి చర్మంపై ప్రయోగాలు చేయకూడదు. మార్కెట్లో దొరికే రకరకాల క్రీములను వాడకూడదు. చర్మతత్త్వానికి, శరీరతత్త్వానికి ఏవి సరిపోతాయో వాటినే వాడాలి.
* మొటిమలను చిదమడం, సూదులతో గుచ్చడం వంటివి చేయకూడదు.
* పుదీనా, తులసి ఆకులను మెత్తగా నూరి పాక్‌లా వేసుకుంటే మొటిమలు తగ్గుతాయి.
* తులసి ఆకులను నూరి దీనికి కొద్దిగా పెరుగు కలిపి పూసుకున్నా ఫలితం ఉంటుంది.
* టమోటా రసాన్ని మొటిమలపై రాసి ఓ గంట తర్వాత ముఖం కడిగేసుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే మొటిమలు తగ్గుతాయి.
* యాపిల్ గుజ్జు ముఖానికి రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగితే మొటిమలు తగ్గి ముఖం కాంతివంతం అవుతుంది.
* వేపాకులను పొడిగా చేసుకుని, దానిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకున్నా మొటిమలు తగ్గిపోతాయి.