ఐడియా

వేసవి చిట్కాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవి వచ్చిందంటే ఎండ వేడిమి తట్టుకోలేరు. ఉద్యోగినులు సరేసరి. మామూలు వ్యక్తులకి కూడా బజారు పనులు తప్పవు. తప్పక చిట్కాలు పాటిస్తే కొంత ఉపశమనము. పిల్లలు, వృద్ధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
1. కళ్ళజోడు - గొడుగు తప్పనిసరి, వెహికల్ అయితే, చున్నీలు, హెల్మెట్‌లు వాడి ఎండ వేడిమి తప్పించుకోవాలి.
2. కాటన్ దుస్తులు, కొంచెం తేలికపాటి బట్టలు ధరించడం మంచిది.
3. నిమ్మకాయ, ఉల్లిపాయ రెండూ జేబులోగాని, పర్సులోగాని పెట్టుకోండి. దాని వాసన చూడటంవల్ల గాల్పుల నుంచి ఉపశమనము.
4. పాలల్లో బార్లీపొడి కలిపి మెడ, ముఖము, చేతులకి, పాదాలకు ప్యాక్ వేసుకుంటే రాష్‌స్ నుంచి తప్పించుకోవచ్చును.
5. రోజ్‌వాటర్ గంధం పొడి కలిపి ప్యాక్ వేసుకుంటే చల్లగా ఉంటుంది.
6. కీరదోస, పెరుగు, బియ్యపు పిండి ప్యాక్ వేసుకుంటే వేడి తగ్గుతుంది.
7. మాగిన ఆరటి పండు గుజ్జు ముఖానికి రాయడంవల్ల చర్మం బిగుతుగా ఉంటుంది.
8. కమలా, దోస, పుచ్చ, బొప్పాయి ముక్కలతో ఏదైనా ఫర్వాలేదు ముఖం, చేతులు రుద్దుకుంటే నలుపు పోతుంది.
9. నిమ్మచెక్క, డెటాల్ వేసి స్నానం చేస్తే చర్మం కాంతిగా ఉంటుంది.
10. మల్లె, మరువం పెట్టుకోవడంవల్ల తలపోటు రాదు, చల్లగా ఉంటుంది.
11. మజ్జిగ, నిమ్మరసం, శొంఠి, కర్వేపాకు కలిపి బాటిల్‌లో పట్టుకెళ్లడం మంచిది.
12. సబ్జా గింజల వాడకం మంచినీటిలో పంచదార వేసి తాగడం మంచిది.
13. పండ్ల రసాలు తాగడం మంచిది, కూల్‌డ్రింక్స్ తాగకపోతేనే మంచిది.
14. ఐస్ వాడకంకంటే కూడా నీళ్ళుమంచివి. కుండలో నీళ్లు తాగడం మరీ మంచిది.
15. ఉసిరిపచ్చడి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌తో తింటే చలవ.
16. రేగి ఒడియాలు దగ్గర ఉంచుకుంటే దాహం వేయకుండా ఉంటుంది.
17. ఎండు ద్రాక్ష, ఊరిన ఉసిరికాయ దగ్గర ఉంచుకోవడం మంచిది.
18. పసుపు నూనె కలిపి రాసుకుని గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తే ఒళ్లు పేలదు.
19. లేత రంగుల వాడకపు తెలుపు బట్టలు కట్టడం మంచిది.
20. నూనె వేపుళ్లు కాక ఉడికించిన వంటకాలు, పెరుగు పచ్చళ్లు మంచిది.
21. వట్టివేళ్ల పరదాలు కిటికీలకు కడితే చల్లగా ఉంటుంది.

-వాణి.పి