ఐడియా

అవిశలు - లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్నివేల సంవత్సరాల చరిత్ర కలిగిన ‘అవిశలు’ ఈ తరం వాళ్లకు అంతగా తెలీదు. కాని విలువైన తృణధాన్యాలు. వీటిని పూర్వకాలంలో విరివిగా ఉపయోగించేవారు. నేడు వీటిని గుర్తించడం లేదు. కానీ వాస్తవానికి అవిశగింజలు ఆరోగ్యప్రదాయకాలుగానే మనం గుర్తి స్తాం. ‘అవిశగింజలు’ తినడం వలన- మన రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చూసి- గుండెకు సరి అయిన రక్తప్రసరణ కలుగుతుంది. మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలకు సుప్రసిద్ధమైన ఈ అవిసెగింజలు హార్మోన్ల సమతౌల్యతకు సహాయపడి ‘కేన్సర్’ నిరోధకంగా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించగల పీచులో 1/3 వంతు పీచు పదార్థం కలిగి అత్యధిక శాతం మాంసకృత్తులతో నిండి శారీరక దారుఢ్యాన్ని పెంచుతుంది. సంతాన లేమిని అరికట్టే అత్యద్భుత ఔషధం కూడా ఈ అవిసెగింజలే! ఇలా మరుగున పడి పోతున్న అనేకానేక పోషక విలువల్ని- మనం తిరిగి మన ఆహారపుటలవాట్లల్లో భాగం చేసుకోవాలి. అపుడేనేడు విస్తరిస్తున్న అనారోగ్య ఫాస్ట్‌పుడ్ సెంటర్లు నుంచి మనలను మనం కాపాడుకోవచ్చు. *