ఐడియా

బొప్పాయతో నిగనిగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి కాలంలో మేకప్ చేయంచుకోవడం సాధారణమైపోయంది. మేకప్ ఎక్కువ కాలం బాగుండాలంటే కొన్ని మెళుకువలు పాటించాలి. దానిలో భాగంగా మేకప్ చేసుకునేవారు ముందుగా ఫేషియల్ చేయించుకుంటే మొహం ఎంతో అందంగా ఉంటుంది. పైగా ఫ్రెష్‌గాను వుంటుంది. ఫేషియల్స్‌లో చాలా పద్ధతులున్నాయి. పండ్లతో చేసుకొనే ఫేషియల్స్ వల్ల ప్రెష్ నెస్ ఎక్కువగా వస్తుంది. చర్మసౌందర్యం ఇనుమడింపచేసేవాటిల్లో పండ్లే మొదటి స్థానాన్ని ఆక్రమించుకుంటాయ. అందులోను బొప్పాయితో చేసే ఫేషియల్ ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది.
బొప్పాయితో తయారుచేసిన క్రీము, పౌడరు ఉపయోగించి ఫేషియల్ చేస్తే ముఖంపై ఏర్పడే నల్లని ముచ్చలు గుంటలను తేలికగా తొలగించుకోవచ్చు. నెలలో కనీసం రెండుసార్లయినా ఈ ఫేషియల్ చేయించుకుంటే మంచిఫలితం పొందవచ్చు.
పపయాక్రీమ్: ఈ క్రీము ముఖంపై ఏర్పడే మచ్చలు నల్లటి వలయాలను ఎంతో సమర్థంగా తొలగిస్తుంది. ఈ క్రీముతో పది, ఇరవై నిమిషాలు మసాజ్ చేసి ఆ తర్వాత మెత్తని బట్ట లేదా దూదితో శుభ్రం చేసుకోవాలి.
పపయాపౌడర్: ఇది చర్మంలోని మృత కణాలను తొలగించి ముఖవర్చస్సును రెట్టింపు చేస్తుంది. పపయాగుజ్జును ఎండబెట్టి పౌడర్ తయారుచేస్తారు. నాలుగైదు చెంచాల పౌడరును పాలలో వేసి పేస్టులాచేసి నుదురు, కళ్లు, బుగ్గలు, గడ్డం, ముక్కు అంతా పట్టించి ఒక పావుగంట ఎండనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రపరచుకోవాలి.
పపయాపాక్: ముఖంపై ఏర్పడే మచ్చలు, గుంతలను త్వరగా తొలగిస్తుంది. ఈ ప్యాక్‌ను ముఖానికి పట్టించి పావుగంట ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌లో బొప్పాయితోపాటు సిట్రస్ పండ్లు కలిపి వుండడంతో ముఖ వర్చస్సు రెండింతలవుతుంది.
పపయామిల్క్: ఫేషియల్‌కి ముందు రెండు అరచేతులలో వేసుకుని ముఖానికి బాగా పట్టించి ఐదు పది నిమిషాలు మసాజ్ చేయాలి. ఈ క్రీము చర్మం లోపలికి వెళ్లి శుభ్రం చేస్తుంది. చర్మంలో వుండే మృత కణాలను తీసివేస్తుంది. దానితో చర్మం నిగనిగలాడుతుంది. ఏపండ్లైనా ప్రకృతి సహజమైనవి కాబట్టి ఎటువంటి దుష్ఫలితాలు చూపవు.

-శ్రీలత